క్రీడాభూమి

నా ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: కొందరు కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ, తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని భారత వెటరన్ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ ఆరోపించాడు. సోమవారం పిటిఐతో అతను మాట్లాడుతూ తనతో పోటీపడే కొంత మంది విపరీతమైన అసూయతో ఉన్నారని, తనను కించపరచడమే వారి లక్ష్యమని పేర్కొన్నాడు. డేవిస్ కప్, ఒలింపిక్స్ వంటి మేజర్ ఈవెంట్స్ జరిగిన ప్రతిసారీ తనను ఏదో ఒక వివాదంలో ఇరికించే ప్రయత్నం జరుగుతున్నదని అన్నాడు. ‘చాలా మంది పోటీదారుల్లో అంతులేని అసూయ ఉంది. కెరీర్‌లో 18 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు గెలవడానికి, ఏడు ఒలింపిక్స్‌లో ఆడడానికి నేను ఎంతగా కష్టపడ్డానో వారికి తెలియదు. నాపై అసూయతో ఉన్న వారు పది జన్మలెత్తినా నా స్థాయికి చేరుకోలేరు. కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కష్టపడడం మానేసిన వారంతా నా ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు’ అన్నాడు. ఒక ప్రశ్నపై స్పందిస్తూ ప్రజలు ఏం అనుకుంటున్నారో, ఏమని విమర్శిస్తున్నారో తాను పట్టించుకోనని అన్నాడు. భారత టెన్నిస్ చరిత్రలో తన అధ్యాయాన్ని లిఖించుకోవడంలో నిమగ్నమయ్యానని చెప్పాడు. ఆ చరిత్రను ఎవరూ చెరపలేరని వ్యాఖ్యానించాడు.

కివీస్ వనే్డ జట్టులో
ఆండర్సన్‌కు స్థానం

వెల్లింగ్టన్, సెప్టెంబర్ 19: భారత్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో పాల్గొనే న్యూజిలాండ్ జట్టులో ఆల్‌రౌండర్ కొరీ ఆండర్సన్‌కు స్థానం దక్కింది. సమర్థుడైనప్పటికీ, గాయాల కారణంగా తరచు జట్టుకు దూరమవుతున్న అతను చివరిసారి అంతర్జాతీయ మ్యాచ్‌ని టి-20 వరల్డ్ కప్ సమయంలో ఆడాడు. ఫిట్నెస్ సమస్య కారణంగా జట్టులోకి రావడం, ఆ వెంటనే స్థానాన్ని కోల్పోవడం అతనికి అలవాటైంది. అతను పూర్తిగా కోలుకున్నాడని, భారత్‌తో వనే్డ సిరీస్‌లో పాల్గొంటాడని న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్‌జెడ్‌సి) ప్రకటించింది. ఇలావుంటే, అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడిన కారణంగా అతను భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే, ఎన్‌జెడ్‌సి ప్రకటించిన 15 మంది సభ్యులతో కూడిన జట్టులో అతనికి కూడా చోటు లభించింది. కేన్ విలియమ్‌సన్ వనే్డల్లోనూ కివీస్ జట్టుకు న్యాయకత్వం వహిస్తాడు.
జట్టు వివరాలు: కేన్ విలియమ్‌సన్ (కెప్టెన్), కొరీ ఆండర్సన్, ట్రెంట్ బౌల్ట్, డౌగ్ బ్రాస్‌వెల్, ఆంటన్ డెవిసిచ్, మార్టిన్ గుప్టిల్, మాట్ హెన్రీ టామ్ లాథమ్, జేమ్స్ నీషం, ల్యూక్ రోన్చీ, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌథీ, రాస్ టేలర్, బిజె వాల్టింగ్.