క్రీడాభూమి

ఇటాలియన్ గ్రాండ్ ప్రీ విజేత రోజ్‌బర్గ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోన్జా, సెప్టెంబర్ 19: ఇక్కడి నేషనల్ సర్క్యూట్‌లో జరిగిన ఇటాలియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్‌ను నికో రోజ్‌బర్గ్ (జర్మనీ) గెల్చుకున్నాడు. మెర్సిడిజ్ వాహనాన్ని నడిపిన అతను రేస్‌ను ఒక గంట, 55 నిమిషాల, 48.950 సెకన్లలో పూర్తి చేసి, టైటిల్ సాధించడంతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్ రేస్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. రెడ్‌బుల్ డ్రైవర్ డానియల్ రిసియార్డో ఈ రేసులో రోజ్‌బర్గ్ కంటే కేవలం అర సెకను ఆలస్యంగా చేరడంతో ద్వితీయ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. మెర్సిడెజ్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్న లూయిస్ హామిల్టన్ ఎనిమిది సెకన్లు ఆలస్యంగా రేస్‌ను పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు.