క్రీడాభూమి

బయోపిక్‌లు ఎందుకు? క్రికెటర్లకు గంభీర్ సూటి ప్రశ్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: క్రికెటర్లకు బయోపిక్‌లు ఎందుకని భారత క్రికెటర్ గౌతం గంభీర్ సూటిగా ప్రశ్నించాడు. భారత పరిమిత ఓవర్ల జట్లకు నాయకత్వం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా నిర్మించిన ‘ఎంఎస్ ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ’ సినిమా ఈనెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ధోనీని విభేదించిన క్రికెటర్ల జాబితాలో ఎప్పుడూ ముందుండే గంభీర్ అతని కారణంగానే జాతీయ జట్టులో తాను స్థానం కోల్పోయానన్న ఆగ్రహంతో ఉన్నాడు. ఈ కారణంగానే ధోనీ బయోపిక్ విడుదలపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. భారత దేశానికి సేవలు అందించిన వారు, పేరుప్రఖ్యాతులు ఆర్జించిన వారు ఎంతో మంది ఉన్నారని ట్వీట్ చేశాడు. వారి స్థాయికి క్రికెటర్లు ఇంకా చేరుకోలేదని వ్యాఖ్యానించాడు. బయోపిక్‌లు తీసుకోవాల్సిన లేదా తీయుంచుకోవాల్సిన స్థాయి క్రికెటర్లకు లేదంటూ ధోనీకి చురకలు అంటించాడు.