క్రీడాభూమి

గబ్బా స్టేడియంలో థ్రిల్లర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చివరి వరకూ ఉత్కంఠ రేపిన పోరు 1992 వరల్డ్ కప్‌లో భాగంగా మే ఒకటిన భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్‌లోని గబ్బా స్టేడియంలో జరిగింది. నరాలు తెగిపోయే ఉత్కంఠ మధ్య సాగిన ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కేవలం ఒక పరుగు తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. వర్షం కారణంగా మ్యాచ్‌ని 47 ఓవర్లకు కుదించడం భారత్ విజయాన్ని దెబ్బకొట్టింది. కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్, సంజయ్ మంజ్రేకర్ వీరోచిత పోరాటం టీమిండియాను విజయం ముంగిట నిలిపింది. కానీ, టామ్ మూడీ వేసిన చివరి ఓవర్‌లో లక్ష్యాన్ని చేరడంలో భారత్ కేవలం రెండు పరుగుల తేడాతో వెనుకబడింది. ఆసీస్ ఓ పరుగు తేడాతో గెలిచింది. ముందు బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 237 పరుగులు చేసింది. డీన్ జోన్స్ 90 పరుగులు సాధించి జట్టును ఆదుకోగా, డేవిడ్ బూన్ 43 పరుగులు చేశాడు. అనంతరం వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా మ్యాచ్‌ని మూడు ఓవర్లు కుదించిన నిర్వాహకులు భారత లక్ష్యంలో మాత్రం కేవలం రెండు పరుగులు తగ్గించారు. ఫలితంగా 47 ఓవర్లలో 236 పరుగులు చేయాల్సిరాగా, మహమ్మద్ అజరుద్దీన్ 93, సంజయ్ మంజ్రేకర్ 47 బంతుల్లో 42 చొప్పున పరుగులు చేయడంతో తీవ్రమైన పోటీకి తెరలేచింది. టామ్ మూడీ వేసిన చివరి ఓవర్‌లో విజయానికి 13 పరుగులు అవసరంకాగా, వికెట్‌కీపర్ కిరణ్ మోరే రెండు ఫోర్లు కొట్టి, అభిమానుల్లో విజయంపై ఆశలను పెంచాడు. అయితే మూడో బంతిలో అతను అవుటయ్యాడు. నాలుగో బంతిలో మనోజ్ ప్రభాకర్ ఒక పరుగు చేశాడు. ఐదో బంతిలో అతను రనౌట్‌కాగా, చివరి బంతికి నాలుగు పరుగులు అవసరమయ్యాయి. డీప్ మిడ్‌వికెట్ స్థానానికి జవగళ్ శ్రీనాథ్ కొట్టిన బంతిని క్యాచ్ అందుకోవడంలో స్టీవ్ వా విఫలమయ్యాడు. అయితే, అప్పటికే రెండు పరుగులు చేసిన శ్రీనాథ్‌ను మూడో పరుగు చేయకుండా అతను రనౌట్ చేయగలిగాడు. దీనితో భారత్ 234 పరుగులకు ఆలౌటైంది.