క్రీడాభూమి

సెలక్షన్ కమిటీకి రేసులో వెంకటేశ్ ప్రసాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: జాతీయ సెలక్షన్ కమిటీకి ఎంపిక జరుపుతామంటూ భార త్ క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) దరఖాస్తులను ఆహ్వానించడంతో, మాజీ క్రికెట ర్లు రేసులోకి దిగుతున్నారు. ఇంతకు ముందు చీఫ్ కోచ్ పదవికి పోటీపడిన మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ ఇప్పుడు సెలక్టర్‌గా ఉండేందుకు ఆసక్తిని చూపుతున్నాడు. అత నితోపాటు మాజీ బౌలర్లు ఆశిష్ కపూర్, మనీందర్ సింగ్ కూడా సెలక్షన్ కమిటీ సభ్య త్వం కోసం దరఖాస్తు చేకున్నారు. పదవీ కాలం పూర్తయన కమిటీలో సభ్యులైన ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడా కేవలం ఏడాది పదవీకాలాన్ని మాత్రమే పూర్తి చేశారు. కాబట్టి వారు కూడా పోటీలో ఉండడం ఖాయంగా కనిపిస్తున్నది. బోర్డు కూడా వారి పట్ల సుముఖత వ్యక్తం చేసే అవకాశాలున్నాయ. పురుషుల విభాగంతోపాటు మహిళ లు, జూనియర్ విభాగాల్లోనూ సెలక్షన్ కమిటీలకు సభ్యుల ఎంపిక జరగనుంది.