క్రీడాభూమి

మొదటి టెస్టుకు ఇశాంత్ శర్మ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, సెప్టెంబర్ 20: అనారోగ్యంతో బాధపడుతున్న భారత ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ న్యూజిలాండ్‌తో జరిగే మొదటి టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. ఈ విషయాన్ని భారత జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. అతను వైరల్ జ్వరంతో బాధపడుతున్నాడని తెలిపింది. విశ్రాంతి అవసరం కాబట్టి, మొదటి టెస్టులో అతను ఆడే అవకాశం లేదని పేర్కొంది. అయితే, ఇశాంత్‌కు రీప్లేస్‌మెంట్‌ను భారత కోచ్ అనీల్ కుంబ్లే కోరడం లేదు. దీనితో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
స్పిన్ పిచ్‌ని కోరలేదు: కుంబ్లే
న్యూజిలాండ్‌తో కాన్పూర్‌లో జరిగే మొదటి టెస్టు కోసం స్పిన్ పిచ్‌ని తాను కోరలేదని టీమిండియా కోచ్ అనీల్ కుంబ్లే స్పష్టం చేశాడు. మంగళవారం అతను పిటిఐతో మాట్లాడుతూ స్పిన్ ట్రాక్ కోసం భారత్ పట్టుబట్టదని, అసలు అలాంటి ఆలోచనే తమకు లేదని అన్నాడు. పిచ్ ఏ విధంగా ఉండాలన్నది క్యూరేటర్‌కు, అక్కడి సిబ్బందికి సంబంధించిన విషయమని చెప్పాడు. తనతోసహా జట్టులోని ఎవరూ ఈ విషయంలో జోక్యం చేసుకోరని తెలిపాడు.

చిత్రం.. ఇశాంత్ శర్మ