క్రీడాభూమి

లోధా కమిటీ సిఫార్సులపై దాటవేత వైఖరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 20: దేశంలో క్రికెట్‌ను ఒక గాడిలో పెట్టడానికి, పాలనా వ్యవహారాలను పారదర్శంగా ఉంచడానికి సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాల్సిన సమయం ఆసన్నమవుతున్నప్పటికీ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఈ అంశంపై స్పష్టమైన వైఖరిని అనుసరించడంలేదు. సమస్యను దాటవేయడానికి ప్రయత్నిస్తున్నదని బుధవారం నాటి వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) అజెండా స్పష్టం చేస్తున్నది. వాస్తవానికి అక్టోబర్ మాసాంతంలోగా లోధా సిఫార్సులను బోర్డు అమలు చేయాల్సి ఉంది. కానీ, అందులోని పలు అంశాలు ఆచరణకు సాధ్యం కాదని బోర్డు వాదిస్తున్నది. సుప్రీం కోర్టులోనూ చుక్కెదురుకావడంతో, మరో మార్గం నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తున్నది. లోధా కమిటీ ప్రతిపాదనలను తప్పనిసరిగా అమలు చేయాలన్న తీర్పుపై మరోసారి విచారణ జరపాల్సిందిగా కోర్టును ఆశ్రయించడం ద్వారా మరికొంత సమయాన్ని సంపాదించాలని ప్రయత్నిస్తున్నది. నిజానికి బుధవారం నాటి సమావేశంలో ప్రధానంగా లోధా కమిటీ సిఫార్సులపైనే చర్చ జరగాలి. కానీ, గౌరవ కార్యదర్శి పదవికి ఎన్నికలు, గతంలో పాలక వర్గం తీసుకున్న నిర్ణయాలకు ఆమోద ముద్ర, జమాఖర్చుల వివరాలకు ఆమోదం వంటి అంశాలను మాత్రమే అజెండాలో చేర్చారు. ప్రస్తుతం ఈ పదవిలో అజయ్ షిర్కే ఉన్నాడు. అతనిని బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న అనురాగ్ ఠాకూర్ నియమించాడు. అయితే, లోధా కమిటీ సిఫార్సుల నేపథ్యంలో, నియామకాలతో ఇబ్బందులు తప్పవని బోర్డు భయపడుతున్నది. అందుకే, గౌరవ కార్యదర్శి పదవికి ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. 87వ వార్షిక సమావేశంలో ప్రధానాంశం ఇదే. ఈ ఏడాది మే 22న షిర్కే పదవి బాధ్యతలు స్వీకరించినప్పుడు, నిబంధనల ప్రకారం ఎజిఎం వరకూ అధికారంలో ఉంటాడని బోర్డు ప్రకటించింది. ఎజిఎం ఎప్పుడు జరిగితే అప్పుడు ఎన్నిక ప్రక్రియను ముగించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి తోడు పారదర్శకతపై లోధా కమిటీ దృష్టి సారిస్తున్నందున గౌరవ కార్యదర్శి పదవికి ఎన్నికలను నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఈ ఏడాది ఫిబ్రవరి 19, మే 22, ఆగస్టు 5 తేదీల్లో జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎంజిఎం ముందు ఉంచుతారు. వాటిని ఆమోదిస్తున్నట్టు తీర్మానాలను ఆమోదిస్తారు. దీనితోపాటు కార్యదర్శి, కోశాధికారి సమర్పించే నివేదికలను కూడా ఎజిఎం పరిశీలించి, చర్చించి, ఆమోదం తెలుపుతుంది. వర్కింగ్ కమిటీ, స్టాండింగ్ కమిటీల ఏర్పాటు, సీనియర్, జూనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుల ఎంపిక తదితర అంశాలు కూడా ఎంజిఎం అజెండాలో చేరాయి. లోధా ప్యానెల్ సిఫార్సులు, వాటి అమలుకు తరుముకొస్తున్న సమయంపై అధికారికంగా ఎలాంటి చర్చ ఉండదు. అయితే, ఈ విషయాలను కూడా ఎజిఎంలో అనధికారికంగా ప్రస్తావించే అవకాశం ఉందని అంటున్నారు.