క్రీడాభూమి

మొహాలీలో అరంగేట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్): గుంటూరులో 1975 ఏప్రిల్ 24న జన్మించిన ఎమ్మెస్కే ప్రసాద్ అంతర్జాతీయ కెరీర్‌ను మొహాలీలో ప్రారంభించాడు. టెస్టు, వనే్డ ఇంటర్నేషనల్స్‌లో అతని ప్రస్థానం మొహాలీలోనే మొదలుకావడం విశేషం. 1998 మే 14న బంగ్లాదేశ్‌తో మొహాలీలో జరిగిన మ్యాచ్‌తో అతను వనే్డల్లో అరంగేట్రం చేశాడు. మరసటి సంవత్సరం, 1999 అక్టోబర్ 14 నుంచి 19వ తేదీ వరకు మొహాలీలోనే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. చివరి వనే్డను అదే ఏడాది నవంబర్ 17న ఢిల్లీలో న్యూజిలాండ్‌పై ఆడాడు. 2000 జనవరి 2 నుంచి 4 వరకూ ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్టు అతని కెరీర్‌లో చివరిది. కెరీర్‌లో అతను 17 వనే్డ ఇంటర్నేషనల్స్‌లో 11 ఇన్నింగ్స్ ఆడాడు. 131 పరుగులు చేశాడు. రెండు పర్యాయాలు నాటౌట్‌గా నిలిచాడు. 63 పరుగులు అతని అత్యధిక స్కోరు. ఇదొక్కటే ఇంటర్నేషనల్ కెరీర్‌లో ఎమ్మెస్కే సాధించిన అర్ధ శతకం. వికెట్‌కీపర్‌గా 14 క్యాచ్‌లు పట్టిన అతను ఏడు స్టంపింగ్స్ చేశాడు. టెస్టుల విషయానికి వస్తే, 6 మ్యాచ్‌ల్లో 11 ఇన్నింగ్స్ ఆడిన అతను ఒకసారి నాటౌట్‌గా నిలిచాడు. మొత్తం 106 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 19 పరుగులు. టెస్టుల్లో 15 క్యాచ్‌లు పట్టిన అతను ఒక్క స్టంపింగ్ కూడా చేయలేదు. క్రికెటర్‌గా అతను మొత్తం 96 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు (160 ఇన్నింగ్స్) ఆడి 4,021 పరుగులు చేశాడు. 15 పర్యాయాలు నాటౌట్‌గా నిలిచిన అతని అత్యధిక స్కోరు 130 పరుగులు. 6 శతకాలు, 24 అర్ధ శతకాలు అతని ఖాతాలో ఉన్నాయి. 239 క్యాచ్‌లు పట్టిన అతను 27 స్టంపింగ్స్ చేశాడు.
జాతీయ చీఫ్ సెలక్టర్‌గా ఎంపికైన ఎమ్మెస్కే పూర్తి పేరు మన్నవ శ్రీకాంత్ ప్రసాద్ గుంటూరు జిల్లాలోని మేడికొండూరులో జన్మించాడు. చదువును నల్లపాడులోని లయోలా పబ్లిక్‌స్కూల్‌లో, డిగ్రీ హిందూ కళాశాలలో పూర్తిచేశాడు. ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ అన్ని కేటగిరీల్లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2000-2001 ఎంఎస్‌కె కెప్టెన్సీ లో ఆంధ్ర రంజీ జట్టు సౌత్‌జోన్ ఛాంపియన్‌షిప్‌ను రెండోసారి దక్కించుకుంది. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం 2009లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా నియమితులైయ్యాడు. 2015లో బిసిసిఐ సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా ఎమ్మెస్కేను నియమించారు. అతని పర్యవేక్షణలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి కల్పన, స్నేహ దీప్తి భారత మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
వరల్డ్ కప్‌పై దృష్టి..
ఇంగ్లాండ్‌లో 2019లో జరిగే ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను దృష్టిలో ఉంచుకొని, ఇప్పటి నుంచే జట్టును తీర్చిదిద్దాల్సిన బాధ్యత జాతీయ చీఫ్ సెలక్టర్‌గా తనపై ఉందని ఎమ్మెస్కే అన్నాడు. తన లక్ష్యం అదేనని చెప్పాడు. న్యూజిలాండ్‌తో గురువారం నుంచి మొదలయ్యే మొదటి టెస్టుతో ఆరంభిస్తే, స్వదేశంలో టీమిండియా మొత్తం 13 టెస్టులు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇవి జట్టుకు ఎంతో కీలకమని తెలిపాడు. తాను విమర్శలను పట్టించుకోనని. వాటికి తన పనితీరే విమర్శకులకు సమాధానమిస్తుందని అన్నాడు.