క్రీడాభూమి

మెస్సీకి విశ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్సిలోనా, సెప్టెంబర్ 22: బార్సిలోనా సాకర్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ గాయం తిరగబెట్టింది. ఫలితంగా అతనికి మూడు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు ప్రకటించారు. స్పానిష్ సాకర్ చాంపియన్‌షిప్ లా లిగాలో భాగంగా అట్లెటిక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడుతున్నప్పుడు కాలి కండరాలు బెణకడంతో అతను మైదానాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ మ్యాచ్‌ని బార్సిలోనా 1-1గా డ్రా చేసుకుంది. మ్యాచ్ 41వ నిమిషంలో ఇవాన్ రాకిటిక్ గోల్ చేసి, బార్సిలోనాను 1-0 ఆధిక్యంలో నిలబెట్టాడు. ఆతర్వాత ఈక్వెలైజర్ కోసం అట్లెటికో మాడ్రిడ్ తీవ్రంగా పోరాడింది. బార్సిలోనా రక్షణ వలయాన్ని ఛేదించేందుకు అనుక్షణం ప్రయత్నించింది. 61వ నిమిషంలో ఆ జట్టు ప్రయత్నం సఫలమైంది. ఏంజెల్ కొరియా ద్వారా ఈక్వెలైజర్ లభించింది. అనంతరం ఇరు జట్లు గోల్స్ చేయడంలో విఫలం కావడంతో మ్యాచ్ డ్రా అయింది.