క్రీడాభూమి

బిసిసిఐ లాభం రూ. 111 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) 2015-16 ఆర్థిక సంవత్స రంలో 111.83 కోట్ల రూపాయలు లాభాన్ని ఆర్జించింది. ఇది భారీ మొత్తమే అయనప్పటికీ, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 55 కోట్ల రూపాయలు తక్కువ. ఖర్చుల కంటే రాబడి గత ఏడాది 166.87 కోట్ల రూపాయలుకాగా, ఈసారి లాభం తగ్గిందని బిసిసిఐ కోశాధికారి అనిరుద్ధ్ చౌదరి తెలిపాడు. బోర్డు ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని అన్నాడు. అంతేగాక, సభ్య సంఘాలకు చెల్లించే మొత్తాన్ని పెంచామని, చాంపియన్స్ లీగ్ టి-20 రద్దయన కారణంగా, ఆ ఆదయానికి గండిపడడం కూడా లాభం తగ్గడానికి కారణాలని పేర్కొన్నాడు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం సుమారు 509.13 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపాడు. టీవీ ప్రసార హక్కుల ద్వారా 388.80 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని చౌదరి వివరించాడు. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున, రానున్న ఆర్థిక సంవత్సరంలో ఆదాయం తగ్గవచ్చని అన్నాడు. దేశంలో క్రికెట్ అభివృద్ధికి బిసిసిఐ విశేషంగా కృషి చేస్తున్నదని తెలిపాడు. వౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై 50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నామన్నాడు.