క్రీడాభూమి

టి-20లో లంకపై కివీస్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌంట్ మంగనుయ్ (న్యూజిలాండ్), జనవరి 7: శ్రీలంకతో గురువారం జరిగిన మొదటి టి-20 మ్యాచ్‌ని మూడు పరుగుల తేడాతో గెల్చుకున్న న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో బోణీ కొట్టింది. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్లకు 179 పరుగులు చేయగలిగింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లుగా వచ్చిన మార్టిన్ గుప్టిల్, కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 10.5 ఓవర్లలో 101 పరుగులు జోడించిన తర్వాత గుప్టిల్ దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. 34 బంతులు ఎదుర్కొన్న అతను నాలుగు ఫోర్లు, మరో నాలుగు సిక్సర్లతో 58 పరుగులు సాధించాడు. విలియమ్‌సన్ 42 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 53 పరుగులు చేసి నువాన్ కులశేఖర బౌలింగ్‌లో లక్మల్ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. కొరీ ఆండర్సన్ కేవలం రెండు పరుగులకే వెనుదిరగ్గా, కొలిన్ మున్రో 36 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద కులశేఖరకు రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. చివరిలో రాస్ టేలర్ 22, గ్రాంట్ ఇలియట్ 10 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, న్యూజిలాండ్ 20 వర్లలో నాలుగు వికెట్లకు 182 పరుగులు సాధించింది. లంక బౌలర్లలో కులశేఖరకు రెండు వికెట్లు లభించాయి.
కివీస్‌ను ఓడించి, సిరీస్‌ను శుభారంభం చేద్దామన్న పట్టుదలతో శ్రీలంక చివరి వరకూ హోరాహోరీగా పోరాడింది. ఓపెనర్ దనుష్క గుణతిలక (46), లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ మిలింద సిరివర్దన (42) తప్ప మిగతా వారు రాణించలేకపోవడంతో లంక ఎంత ప్రయత్నించినా లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఇలియట్ వేసిన చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరంకాగా, రెండు వికెట్లు కోల్పోయిన లంక పది పరుగులు చేయగలిగింది.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 (గుప్టిల్ 58, విలియమ్‌సన్ 53, కులశేఖర 2/26).
శ్రీలంక ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 (గుణతిరక 46, సిరివర్దన 42, హెన్రీ 3/44, ట్రెంట్ బౌల్ట్ 3/21).