క్రీడాభూమి

భారత బాక్సింగ్ సమాఖ్య ఎన్నికలకు పరిశీలకుడిగా టన్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎస్‌ఎఫ్) ఎన్నికలు ఈనెల 25న జరగనుండగా, పరిశీలకుడిగా ఎడ్గర్ టన్నర్‌ను పంపాలని అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఐఎబిఎ) నిర్ణయించింది. ఆస్ట్రేలియాకు చెందిన టన్నర్ ఐఎబిఎకు విదేశాల్లో ఎన్నికల పరిశీలక కమిటీకి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. బిఎస్‌ఎఫ్ ఎన్నికలను పర్యవేక్షించడానికి అతను శనివారం భారత్ చేరుకుంటాడు. నాలుగేళ్ల కాలంలో మూడో బాక్సింగ్ సమాఖ్యకు ఎన్నికలు జరగనుండడం గమానార్హం. మొదట్లో అఖిల భారత బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) ఉండేది. అయితే, అవినీతి, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎఐబిఎను రద్దు చేసింది. దాని స్థానంలో బాక్సింగ్ ఇండియా (బిఐ)ని ఏర్పాటు చేసింది. అయితే, ఎఐబిఎ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతో రెండు బాక్సింగ్ సమాఖ్యల మధ్య యుద్ధం మొదలైంది. దీనికితోడు బాక్సింగ్ ఇండియాలో చేరేందుకు దేశంలోని దాదాపుగా అన్ని అనుబంధ సంఘాలు నిరాకరించడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని గమనించిన ఐఎబిఎ భారత్‌లోని రెండు సమాఖ్యల గుర్తింపును రద్దు చేసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో బిఎఫ్‌ఐని ఏర్పాటు చేసిన భారత బాక్సింగ్ రంగం పెద్దలు ఎన్నికలను నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న టన్నర్‌నే పరిశీలకుడిగా పంపుతున్నది.
ద్విముఖ పోటీ
అధ్యక్ష పదవికి అజయ్ సింగ్ (ఉత్తరాఖండ్), రోహిత్ జైన్ (్ఢల్లీ) మధ్య ద్విముఖ పోటీ నెలకొంది. రాజేష్ భండారీ (హిమాచల్ ప్రదేశ్), రాకేష్ థక్రాన్ (హర్యానా) పోటీ నుంచి వైదొలగడంతో అజయ్, రోహిత్ బరిలో మిగిలారు. అయితే, అధ్యక్ష పదవిని విరమించుకున్నప్పటికీ ప్రధాన కార్యదర్శి రేసులో థక్రాన్ కొనసాగుతున్నాడు. అతనితోపాటు లెనీ డి గామా (గోవా), జై కోలీ (మహారాష్ట్ర) కూడా ఈ పదివికి పోటీపడుతున్నారు. మరో నామినీ నిర్మలోక్ సింగ్ (జమ్మూ-కశ్మీర్) మాత్రం పోటీ నుంచి తప్పుకొన్నాడు. కోశాధికారి పదవికి హేమంత కుమార్ కలిటా (అస్సాం) ఏకగ్రీవంగా ఎన్నికకానున్నాడు. అతనితో పోటీపడాల్సిన జాన్ కర్ష్‌సింగ్ (మేఘాలయ) వైదొలగడంతో, హేమంత కుమార్ పోటీ లేకుండా గెలవనున్నాడు.