క్రీడాభూమి

జపాన్ సూపర్ సిరీస్ శ్రీకాంత్ నిష్క్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, సెప్టెంబర్ 23: భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ ఇక్కడ జరుగుతున్న జపాన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్‌లో ఓటమిపాలై నిష్క్రమించాడు. దీనితో ఈ టోర్నీలో భారత్ పోరాటానికి తెరపడింది. జర్మనీకి చెందిన మార్క్ వీబ్లర్‌తో శ్రీకాంత్ చివరి వరకూ హోరాహోరీగా పోరాడాడు. ఈ మ్యాచ్‌కి ముందు అతనితో మూడు పర్యాయాలు తలపడిన శ్రీకాంత్ రెండు విజయాలను నమోదు చేశాడు. దీనితో విజయావకాశాలు శ్రీకాంత్‌కే ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, వీబ్లర్ చివరి వరకూ పోరాడి, 21-18, 14-21, 19-21 తేడాతో విజయం సాధించాడు.

చిత్రం.. జపాన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ క్వార్టర్స్‌లో ఓడిన భారత ఆటగాడు శ్రీకాంత్