క్రీడాభూమి

భారత బౌలింగ్ వెలవెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, సెప్టెంబర్ 23: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత బౌలింగ్ వెలవెలబోతున్నది. వర్షం కారణంగా చివరి సెషన్ రద్దయిన రెండో రోజు ఆటలో కివీస్ బ్యాటింగ్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయిన ఆ జట్టు 152 పరుగులు చేసింది. టీమిండియా కంటే ఆ జట్టు ఇంకా 166 పరుగులు వెనుకంజలో నిలిచింది. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నాయి. తొమ్మిది వికెట్లకు 291 పరుగుల స్కోరువద్ద రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ 318 పరుగులకు ఆలౌటైంది. 27 బంతులు ఎదుర్కొని 9 పరుగులు చేసిన ఉమేష్ యాదవ్‌ను వికెట్‌కీపర్ వాల్టింగ్ క్యాచ్ పట్టగా నీల్ వాగ్నర్ అవుట్ చేశాడు. రవీంద్ర జడేజా 42 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. 44 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంట్నర్ చెరి మూడు వికెట్లు పడగొట్టారు. వాగ్నర్‌కు 2 వికెట్లు లభించాయి.
పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్‌ను సమర్థంగా కట్టడి చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి, వర్షం కారణంగా ఆటను నిలిపివేసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 152 పరుగులు చేసింది. మార్టిన్ గుప్టిల్ 31 బంతులు ఎదుర్కొని 21 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 35 పరుగుల స్కోరువద్ద కివీస్‌ను తొలి దెబ్బతీసిన ఉమేష్ భారత బౌలింగ్‌పై ఆశలు పెంచాడు. కేన్ విలియమ్‌సన్, టామ్ లాథమ్‌లపై ఒత్తిడి పెరుగుతుందని, ఫలితంగా మరికొన్ని వికెట్లు కూలుతాయని అంతా ఆశించారు. కానీ, వారిద్దరూ క్రీజ్‌లో నిలదొక్కుకొని టీ విరామ సమయానికి స్కోరును 152 పరుగులకు చేర్చారు. రెండో వికెట్‌కు వీరు 37.3 ఓవర్లలో అజేయంగా 117 పరుగులు జోడించారు. ఓపెనర్ లాథమ్ 137 బంతులు ఎదుర్కొని, 5 ఫోర్లతో 56 పరుగులు సాధించగా, ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్‌గా వచ్చిన కెప్టెన్ విలియమ్‌సన్ 115 బంతుల్లో 65 పరుగులు చేశాడు. అతని స్కోరులో 7 ఫోర్లు ఉన్నాయి.
న్యూజిలాండ్ స్పిన్నర్లు మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ భారత బ్యాట్స్‌మెన్‌ను బాగానే కట్టడి చేశారు. సోధీకి ఒక వికెట్ లభిస్తే, సాంట్నర్ మూడు వికెట్లు కూల్చాడు. కాన్పూర్ గ్రీన్ పార్క్ పిచ్ స్పిన్‌కు బాగా సహకరిస్తుందని ఆరంభం నుంచి అంచనాలు ఉన్న నేపథ్యంలో, భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అద్భుతాలు సృష్టిస్తారని అభిమానులు ఊహించారు. కానీ, కివీస్ బ్యాట్స్‌మెన్ లాథమ్, విలియమ్‌సన్‌లను వీరిద్దరూ ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. అశ్విన్ బౌలింగ్‌లో విలియమ్‌సన్ చాలాసార్లు బంతిని స్వీప్ చేయగలిగాడు. లాథమ్ కూడా భారత స్పిన్నర్లను ధాటిగానే ఎదుర్కొన్నాడు. అశ్విన్ 14 ఓవర్లలో 44 పరుగులు సమర్పించుకోగా, జడేజా 17 ఓవర్లు బౌల్ చేసి 47 పరుగులు ఇచ్చాడు.
విజయ్ బౌలింగ్
భారత ఓపెనర్ మురళీ విజయ్ బౌలింగ్‌కు దిగి, ఒక ఓవర్ వేశాడు. రెగ్యులర్ బౌలర్లు వికెట్లు పడగొట్టడంలో విఫలం కావడంతో, కివీస్ బ్యాట్స్‌మెన్‌ను అయోమయానికి గురి చేసి దెబ్బతీయాలన్న వ్యూహంతో విజయ్‌ని కోహ్లీ బరిలోకి దించాడు. ఒకే ఓవర్ బౌల్ చేసిన అతను లాథమ్‌ను బాగానే ఇబ్బంది పెట్టాడు. ఒక బంతి బ్యాట్‌ను తప్పించుకొని అతని ప్యాడ్స్‌కు తగిలింది. వికెట్ల ముందు ఉన్నాడంటూ విజయ్‌తోపాటు ఫీల్డర్లు కూడా అప్పీల్ చేశారు. కానీ అంపైర్ దానిని తోసిపుచ్చాడు. విజయ్ వేసిన మరో బంతి బ్యాట్స్‌మన్ లాథమ్‌తోపాటు వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహాను కూడా ఏమార్చి బౌండరీకి దూసుకెళ్లింది.
లాథమ్ 23వ హాఫ్ సెంచరీ
టామ్ లాథమ్ కెరీర్‌లో 23వ అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో బంతిని కవర్స్ దిశగా పంపి, రెండు పరుగులు సాధించడంతో అతను హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. అంతకు ముందు ఓవర్‌లో అతను అవుటయ్యాడనే ప్రేక్షకులు భావించారు. జడేజా వేసిన బంతి ఆఫ్ స్టంప్ నుంచి దూరంగా పడింది. దీనిని కొట్టేందుకు ప్రయత్నించి లాథమ్ బ్యాట్‌కు బంతి తలిగింది. అనంతరం అతని బూట్లకు తగులుతూ ఫార్వర్డ్ షార్ట్‌లెగ్ స్థానంలోనికి వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న లోకేష్ రాహుల్ ఎంతో లాఘవంగా బంతిని పట్టుకున్నాడు. కానీ, బూట్లకు తగిలే ముందు హెల్మెట్ గ్రిల్‌కు బంతి తగిలిందన్న కారణంగా లాథమ్‌ను అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు.

విలియమ్‌సన్ అదృష్టం
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ అదృష్టవశాత్తు అవుటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. అశ్విన్ బౌలింగ్‌లో బంతిని స్వీప్ షాట్ కొట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. బంతి ఒక్కసారిగా దిశను మార్చుకొని అతని హెల్మెట్ వెనుక భాగానికి తగులుతూ స్టంప్స్‌ను ముద్దాడింది. అయితే, బెయల్స్ కింద పడకపోవడంతో అతను అవుట్ కాలేదు. కివీస్ ఇన్నింగ్స్‌లో అది 32వ ఓవర్‌కాగా, ఆ సమయంలో విలియమ్‌సన్ 39 పరుగుల వద్ద ఆడుతున్నాడు.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్/ ఓవర్‌నైట్ స్కోరు 9 వికెట్లకు 291): లోకేష్ రాహుల్ సు బిజె వాల్టింగ్ బి మిచెల్ సాంట్నర్ 32, మురళీ విజయ్ సి వాల్టింగ్ బి ఇష్ సోధీ 65, చటేశ్వర్ పుజారా సి అండ్ బి సాంట్నర్ 62, విరాట్ కోహ్లీ సి సోధీ బి నీల్ వాగ్నర్ 9, ఆజింక్య రహానే సి మాట్ లాథమ్ బి మార్క్ క్రెగ్ 18, రోహిత్ శర్మ సి సోధీ బి సాంట్నర్ 35, రవిచంద్రన్ అశ్విన్ సి రాస్ టేలర్ బి ట్రెంట్ బౌల్ట్ 40, వృద్ధిమాన్ సాహా బి బౌల్ట్ 0, రవీంద్ర జడేజా 42 నాటౌట్, మహమ్మద్ షమీ బి బౌల్ట్ 0, ఉమేష్ యాదవ్ సి వాల్టింగ్ బి వాగ్నర్ 9, ఎక్‌స్ట్రాలు 6, మొత్తం (97 ఓవర్లలో ఆలౌట్) 318.
వికెట్ల పతనం: 1-42, 2-154, 3-167, 4-185, 5-209, 6-261, 7-262, 8-273, 9-277, 10-318.
బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 2-3-67-3, నీల్ వాగ్నర్ 15-4-42-2, మిచెల్ సాంట్నర్ 23-2-94-3, మాట్ క్రెగ్ 24-6-59-1, ఇష్ సోధీ 15-3-50-1.
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: మార్టిన్ గుప్టిల్ ఎల్‌బి ఉమేష్ యాదవ్ 21, టామ్ లాథమ్ 56 నాటౌట్, కేన్ విలియమ్‌సన్ 65 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 10, మొత్తం (47 ఓవర్లలో వికెట్ నష్టానికి) 152.
వికెట్ల పతనం: 1-35.
బౌలింగ్: మహమ్మద్ షమీ 8-1-26-0, ఉమేష్ యాదవ్ 7-2-22-1, రవీంద్ర జడేజా 17-1-47-0, అశ్విన్ 14-1-44-0, మురళీ విజయ్ 1-0-5-0.

చిత్రం.. అర్ధ శతకాన్ని పూర్తి చేసిన మిచెల్ లాథమ్‌ను అభినందిస్తున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ (ఎడమ)