క్రీడాభూమి

కష్టాల్లో నేమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, సెప్టెంబర్ 24: బార్సిలోనాకు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రెజిల్ సాకర్ సూపర్ స్టార్ నేమార్‌ను మరోసారి కష్టాలు చుట్టుముట్టాయి. పన్ను ఎగవేత కేసును స్పెయిన్ కోర్టు తిరగతోడడంతో నేమార్‌తోపాటు అతని తండ్రి కూడా విచారణను ఎదుర్కోనున్నాడు. సాంటోస్ నుంచి నేమార్‌ను బార్సిలోనా తీసుకుంది. ఆ సమయంలో ట్రాన్స్‌ఫర్ ఫీజు కింద 57.1 మిలియన్ యూరోలు (సుమారు 428 కోట్ల రూపాయలు) చెల్లించినట్టు బార్సిలోనా ప్రకటించింది. అందులో 40 మిలియన్ యూరోలు (సుమారు 300 కోట్ల రూపాయలు) నేమార్ కుటుంబానికి చెల్లించినట్టు పేర్కొంది. అయితే, బార్సిలోనాతో నేమార్ కుదుర్చుకున్న పలు ఒప్పందాల విలువ 83 మిలియన్ యూరోలు (సుమారు 622 కోట్ల రూపాయలు) వరకు ఉంటుందని స్పెయిన్ అధికారులు అనుమానిస్తున్నారు. ట్రాన్స్‌ఫర్ ఫీజును, ఇతరత్రా ఒప్పందాల ద్వారా వచ్చిన మొత్తాలను తక్కువగా చూపించడం ద్వారా నేమార్, అతని తండ్రి భారీగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారని ఇది వరకే మాడ్రిడ్ కోర్టులో కేసు వేసింది. ఈ కేసులో విచారణ జరిపిన తర్వాత, బార్సిలోనా ఇచ్చిన నివేదిక ఆధారంగా అప్పట్లో కోర్టు కేసును తోసిపుచ్చింది. అయితే, స్పెయిన్ ఆదాయం పన్ను అధికారులు మరోసారి పక్కా సమాచారంతోపాటు సాక్ష్యాధారాలతోసహా కోర్టులో పిటిషన్ వేశారు. దీనితో నేమార్ కేసును మాడ్రిడ్ కోర్టు మళ్లీ విచారణకు స్వీకరించింది.

చిత్రం.. ఆదాయానికి సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చాడన్న కేసును ఎదుర్కొంటున్న నేమార్