క్రీడాభూమి

మాకూ సమర్థులున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, సెప్టెంబర్ 24: తమ జట్టులోనూ సమర్థులున్నారని, ప్రత్యేకించి స్పిన్ ట్రాక్‌పై రాణించ సత్తాగల వారితో జట్టు పటిష్టంగా ఉందని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ అన్నాడు. కాన్పూర్ మైదానం స్పిన్‌కు అనుకూలంచే అవకాశాలు ఉన్నాయని అంటూ, తమ జట్టులో మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీలను సమర్థులైన స్పిన్నర్లుగా అభివర్ణించాడు. మిగతా రెండు రోజుల్లో వారు చక్కటి ప్రదర్శనతో రాణిస్తారని ధీమా వ్యక్తం చేశాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ భారత్‌లో జరిగిన టి-20 ప్రపంచ కప్‌లో మ్యాచ్‌లు ఆడిన అనుభవం తమకు బాగా ఉపయోగపడుతున్నదని అన్నాడు. ఆ టోర్నీలో భారత్‌ను 47 పరుగుల తేడాతో ఓడించి, న్యూజిలాండ్ నాకౌట్ దశకు చేరుకున్న విషయాన్ని గుర్తుచేశాడు. తమకు అత్యంత కీలకమైన ఆ మ్యాచ్‌లో సాంట్నర్ 11 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టి భారత్‌ను దెబ్బతీశాడని, ఇష్ సోధీ మూడు వికెట్లు సాధించడంతో తమ విజయం సులభసాధ్యమైందని తెలిపాడు. ఫార్మెట్ మారినప్పటికీ, అప్పటి అనుభవంతో తాము మెరుగైన ప్రదర్శనతో వారు ఆకట్టుకుంటారని జోస్యం చెప్పాడు. యువకులు, సీనియర్లతో జట్టు సమతూకంగా ఉందని విలియమ్‌సన్ చెప్పాడు. టీమిండియాతో భారత్‌లోనే సిరీస్ ఆడడం వల్ల జట్టులోని ఆటగాళ్లందరికీ ఎన్నో పాఠాలు నేర్చుకునే అవకాశం దక్కుతుందని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడేటప్పుడు ముందస్తు మ్యాచ్‌లు, సన్నాహాలు ఉండాలని కోరుకోవడంలో అర్థం లేదని అన్నాడు. అన్ని విషయాలూ మనకు అనుకూలంగానే ఉండవని, అన్ని పరిస్థితులకూ అలవాటుపడి ముందుకు వెళ్లడమే క్రికెటర్ల లక్షణమని చెప్పాడు. భారత్‌ను భారత దేశంలోనే ఎదుర్కోవడం సామాన్యం కాదని అంటూ, అంతమాత్రం చేత తాము ఒత్తిడికి గురికావడం లేదని స్పష్టం చేశాడు. మొదటి టెస్టులో ఇప్పటి వరకూ జరిగిన మూడు రోజుల ఆటలో తమ ప్రదర్శన సంతృప్తి కరంగానే ఉందన్నాడు. బ్యాటింగ్‌లో పటిష్టమైన భారత్‌ను కట్టడి చేయడానికి అవసరమైన అన్న ప్రయత్నాలు చేస్తామన్నాడు. మొదటి టెస్టు నుంచి మొదలై, ఈ సిరీస్ ఉత్కంఠ భరితంగా సాగుతుందని విలియమ్‌సన్ జోస్యం చెప్పాడు. కాన్పూర్ వికెట్ గురించి మాట్లాడుతూ, గట్టి ఎక్కువగా ఉందని కాబట్టి స్పిన్‌కు అనుకూలించవచ్చని అభిప్రాయపడ్డాడు. ఫాస్ట్ బౌలర్లు బంతిని స్వింగ్ చేయడానికి కూడా ఈ పిచ్ అనుకూలంగానే ఉంటుందన్నాడు. భారత్‌లో తమకు చెప్పుకోదగ్గ రికార్డు లేకపోయినా, ఈ సిరీస్‌లో గట్టిపోటీనిస్తామని అన్నాడు. హోరాహోరీ పోరు తప్పదని విలియమ్‌సన్ పేర్కొన్నాడు.