క్రీడాభూమి

గంగూలీ శతకం వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన అత్యంత ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌ల్లో ఇదొకటి. మెల్బోర్న్ మైదానంలో, 2000 జనవరి 12న జరిగిన ఈ వనే్డలో అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ శతకం వృథా అయింది. భారత అభిమానులు ఆగ్రహించి, మైదానంలోకి సీసాలు, ఇతర వస్తువులను విసిరి గందరగోళం సృష్టించడంతో 17 నిమిషాల పాటు ఆట ఆగిపోయింది. అయితే, ఈ సమస్యను ఏమాత్రం పట్టించుకోని ఆస్ట్రేలియా మళ్లీ ఆట మొదలైనప్పుడు భారత్‌పై పట్టును కొనసాగిస్తూ, 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. అప్పటికే ఆసీస్ చేతిలో టెస్టు సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన భారత్ ఆతర్వాత కార్ల్‌టన్ అండ్ యునైటెడ్ పరిమిత ఓవర్ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌ను ఢీకొని పరాజయాన్ని చవిచూసింది. ఆతర్వాత ఆసీస్‌ను ఢీకొన్నప్పుడు గంగూలీ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 269 పరుగులు చేసింది. రికీ పాంటింగ్ 115, మైఖేల్ బెవాన్ 41 పరుగులతో రాణించారు. ఆతర్వాత భారత లక్ష్య సాధనను గంగూలీ ముందుండి నడిపించాడు. 127 బంతుల్లోనే 100 పరుగులు చేసి, దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతను అనూహ్యంగా రనౌట్‌కావడంతో ఆగ్రహించిన భారత అభిమానులు గలభా సృష్టించారు. రాహుల్ ద్రవిడ్ 60 పరుగులు చేసినా, మిగతా బ్యాట్స్‌మెన్ వేగంగా పరుగులను రాబట్టుకోలేకపోయారు. దీనితో భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 241 పరుగులు చేయగలిగింది.