క్రీడాభూమి

బిఎఫ్‌ఐ అధ్యక్షుడిగా అభయ్ ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 25: భారత బాక్సింగ్ రంగంలో సుమారు నాలుగేళ్లుగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది. కొత్తగా ఏర్పాటు చేసిన భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్‌ఐ)కి ఎన్నికలు జరగ్గా, అధ్యక్షుడిగా ప్రముఖ వ్యాపారవేత్త అభయ్ సింగ్ ఎన్నికయ్యాడు. అతనికి 49 ఓట్లురాగా, మరో అభ్యర్థి రోహిత్ జైనేంద్ర జైన్‌కు 15 ఓట్లు దక్కాయి. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ చైర్మన్/ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న అభయ్ ఎన్నిక ఖాయమని ఓటింగ్‌కు ముందుగానే వార్తలు వచ్చాయి. అనుకున్న విధంగానే అతను విజయ ఢంకా మోయించాడు. ప్రధాన కార్యదర్శి జై కోహ్లీ మరోసారి ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా సాగిందని అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఎఐబిఎ) నుంచి పరిశీలకుడిగా వచ్చిన ఎడ్గర్ టన్నర్ ప్రకటించాడు.
కొత్తగా ఎన్నికైన కార్యవర్గం ఇదే
అధ్యక్షుడు: అజయ్ సింగ్ (ఉత్తరాఖండ్)
ఉపాధ్యక్షులు: కోయిబీ సలామ్ సింగ్ (నార్త్-ఈస్ట్), జాన్ ఖార్సింగ్ (ఈస్ట్), అనిల్ కుమార్ బొహీందర్ (సౌత్-ఈస్ట్), సిబి రాజే (సౌత్), అమర్‌జిత్ సింగ్ (వెస్ట్), నరేంద్ర కుమార్ నిర్వాన్ (నార్త్-వెస్ట్), రాజేష్ భండారీ (నార్త్), అనిల్ కుమార్ మిశ్రా (సెంటల్).
ప్రధాన కార్యదర్శి: జై కోలీ (మహారాష్ట్ర).
కోశాధికారి: హేమలతా కుమార్ కలిటా (అస్సాం).
జోనల్ కార్యదర్శులు: స్వపన్ బెనర్జీ (ఈస్ట్), జివి రవి రాజు (సౌత్-ఈస్ట్), ఆర్ గోపు (సౌత్), రాజేష్ దేశాయ్ (వెస్ట్), దిగ్విజయ్ సింగ్ (నార్త్-వెస్ట్), సంతోష్ కుమార్ దత్తా (నార్త్), రాజీవ్ కుమార్ సింగ్ (సెంట్రల్).

చిత్రం.. అభయ్ సింగ్