క్రీడాభూమి

అశ్విన్ ‘డబుల్ సెంచరీ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, సెప్టెంబర్ 25: భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్‌లో 200వ వికెట్ల మైలురాయిని చేరాడు. టీమిండియా ఆడుతున్న 500వ టెస్టులో అతను ఈ ఫీట్‌ను అందుకోవడం విశేషం. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ నాలుగో రోజు ఆటలో అశ్విన్ విజృంభణకు భారత్‌కు లాభించింది. మ్యాచ్‌పై పట్టు సంపాదించేందుకు ఉపయోగపడింది. మొదటి ఇన్నింగ్స్‌లో 318 పరుగులు చేసిన భారత్, ఆతర్వాత కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకే ఆలౌట్ చేసి, 56 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన విషయం తెలిసిందే. ఈ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించి, మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 159 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించి ఐదు వికెట్లకు 377 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి, న్యూజిలాండ్ ముందు 434 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఈ భారీ స్కోరును సాధించేందుకు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కివీస్ నాలుగో రోజు, ఆదివారం ఆట ముగిసే సమయానికి 80 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. అశ్విన్ 13 ఓవర్లు బౌల్ చేసి, 60 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు.
చటేశ్వర్ పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 153 పరుగులు జోడించిన తర్వాత మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో మురళీ విజయ్ అవుటయ్యాడు. మొత్తం 170 బంతులు ఎదుర్కొన్న అతను 76 పరుగులు చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, 18 పరుగులకే మార్క్ క్రెగ్ బౌలింగ్‌లో ఇష్ సోధీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. టాప్ స్కోరర్ పుజారా 152 బంతుల్లో 78 పరుగులు చేశాడు. పది ఫోర్లు బాదిన అతను ఇష్ సోధీ బౌలింగ్‌లో రాస్ టేలర్‌కు దొరికిపోయాడు. ఆజింక్య రహానే 40 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో రాస్ టేలర్‌కే చిక్కాడు. రోహిత్ శర్మ (93 బంతుల్లో 68), రవీంద్ర జడేజా (58 బంతుల్లో 50) అర్ధ శతకాలు సాధించి నాటౌట్‌గా నిలిచారు. 107.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 377 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు కెప్టెన్ కోహ్లీ ప్రకటించాడు.
ఒత్తిడిలో కివీస్
విజయానికి ఏకంగా 434 పరుగులు సాధించాల్సిన ఉండగా, రెండు పరుగుల వద్ద మార్టిన్ గుప్టిల్ (0), మరో పరుగు అనంతరం టామ్ లాథమ్ (2) అవుటయ్యారు. ఓపెనర్లు ఇద్దరినీ అశ్విన్ పెవిలియన్‌కు పంపడంతో కివీస్ తీవ్రమైన ఒత్తిడికి గురైంది. వికెట్లను కాపాడుకునే ప్రయత్నంలో అతి జాగ్రత్తకు పోయిన కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ (25) బంతిని సరిగ్గా అర్థం చేసుకోలేక, అశ్విన్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో విశేష అనుభవం ఉన్న రాస్ టేలర్ (17) ఎవరూ ఊహించని విధంగా రనౌట్ కావడంతో 56 పరుగులకే కివీస్ నాలుగు వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ల్యూక్ రోన్చీ (27), నైట్‌వాట్‌మన్ మిచెల్ సాంట్నర్ (6) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. విజయానికి న్యూజిలాండ్ ఇంకా 341 పరుగులు చేయాల్సి ఉంది. ఆరు వికెట్లు చేతిలో ఉన్నాయి. అశ్విన్, రవీంద్ర జడేజా మొదటి ఇన్నింగ్స్‌లో మాదిరిగానే తమ స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శిస్తే, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ బోణీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తొమ్మిదో వాడు..
* టెస్టు క్రికెట్‌లో 200 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో అశ్విన్ తొమ్మిదో స్థానాన్ని సంపాదించాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 619 వికెట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (417), జహీర్ ఖాన్ (311), బిషన్ సింగ్ బేడీ (266), చంద్రశేఖర్ (242), శ్రీనాథ్ (236), ఇశాంత్ శర్మ (209) కూడా ఈ జాబితాలో ఉన్నారు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన జట్టులో అశ్విన్‌తోపాటు ఇశాంత్ కూడా ఉన్నాడు.

* టెస్టు క్రికెట్ చరిత్రలోనే టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన బ్యాట్స్‌మన్ 50 నుంచి 80 వరకు పరుగులు సాధించడం ఇది మూడోసారి.1962-63 సీజన్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య బ్రిస్బేన్‌లో జరిగిన టెస్టులో మొదటిసారి, 1997-98 సీజన్‌లో చెన్నైలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్టులో రెండోసారి ఈ విధంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ముగ్గురు రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 50 నుంచి 80 వరకు పరుగుల స్కోర్లు ఆరింటిని నమోదు చేశారు. కాగా, భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండేసి పర్యాయాలు ఈ రికార్డులో భాగస్వాములు కావడం విశేషం.
చటేశ్వర్ పుజారా తన కెరీర్‌లో తొమ్మిదవ, భారత్‌లో ఆరవ అర్ధ శతకాన్ని సాధించాడు. స్వదేశంలో అతను మొత్తం 18 టెస్టులు (29 ఇన్నింగ్స్)లో 64.84 సగటుతో మొత్తం 1,621 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు శతకాలు కూడా ఉన్నాయ.

టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 78 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన చటేశ్వర్ పుజారా. మురళీ విజయ్‌తోపాటు అతను కూడా ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లోనూ అర్ధ శతకాలను నమోదు చేశాడు.

గ్రిమ్మెట్ టాప్
తక్కువ టెస్టుల్లోనే రెండు వందల వికెట్లను సాధించిన బౌలర్ల జాబితాలో క్లారీ గ్రిమ్మెట్‌ది అగ్రస్థానం. న్యూజిలాండ్‌లో జన్మించినప్పటికీ, ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించిన అతను తన 36వ టెస్టులోనే 200 వికెట్ల మైలురాయిని చేరాడు. ఆస్ట్రేలియాకే చెందిన డెన్నిస్ లిల్లీ, పాకిస్తాన్ పేసర్ వకార్ యూనిస్ చెరి 38 టెస్టుల్ల్లో ఈ ఫీట్‌ను ప్రదర్శించి ఇప్పటి వరకూ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. అయితే, కెరీర్‌లో 37వ టెస్టు ఆడుతున్న భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆదివారం నాటి ఆటలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్‌ను ఎల్‌బిగా అవుట్ చేసి, 200 వికెట్లను పూర్తి చేశాడు. దీనితో లిల్లీ, యూనిస్ మూడో స్థానానికి పడిపోయారు.

స్కోరుబోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్: 97 ఓవర్లలో 318 ఆలౌట్ (లోకేష్ రాహుల్ 32, మురళీ విజయ్ 65, చటేశ్వర్ పుజారా 62, రోహిత్ శర్మ 35, రవిచంద్రన్ అశ్విన్ 40, రవీంద్ర జడేజా 42 నాటౌట్, ట్రెంట్ బౌల్ట్ 3/67, నీల్ వాగ్నర్ 2/42, మిచెల్ సాంట్నర్ 3/94).
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 95.5 ఓవర్లలో 262 ఆలౌట్ (టామ్ లాథమ్ 58, కేన్ విలియమ్‌సన్ 75, రవీంద్ర జడేజా 5/73. అశ్విన్ 4/93.
భారత్ రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు వికెట్ నష్టానికి 159): లోకేష్ రాహుల్ సి రాస్ టేలర్ బి ఇష్ సోధీ 38, మురళీ విజయ్ ఎల్‌బి మిచెల్ సాంట్నర్ 76, చటేశ్వర్ పుజారా సి రాస్ టేలర్ బి ఇష్ సోధీ 78, విరాట్ కోహ్లీ సి ఇష్ సోధీ బి మార్క్ క్రెగ్ 18, ఆజింక్య రహానే సి రాస్ టేలర్ బి మిచెల్ సాంట్నర్ 40, రోహిత్ శర్మ 68 నాటౌట్, రవీంద్ర జడేజా 50 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 9, మొత్తం (107.2 ఓవర్లలో 5 వికెట్లకు) 377 డిక్లేర్డ్.
వికెట్ల పతనం: 1-52, 2-185, 3-214, 4-228, 5-277.
బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 9-0-34-0, మిచెల్ సాంట్నర్ 32.2-11-79-2, మార్క్ క్రెగ్ 23-3-80-1, నీల్ వాగ్నర్ 16-5-52-0, ఇష్ సోధీ 20-1-99-2, మార్టిన్ గుప్టిల్ 4-0-17-0, కేన్ విలియమ్‌సన్ 3-0-7-0.

చిత్రం.. రవిచంద్రన్ అశ్విన్