క్రీడాభూమి

శ్రీకాంత్‌పైనే భారత్ ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, సెప్టెంబర్ 26: కొరియా ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఆశలన్నీ కిడాంబి శ్రీకాంత్‌పైనే పెట్టుకుంది. మంగళవారం నాటి క్వాలిఫయర్స్‌తో ప్రారంభం కానున్న ఈ టోర్నీలో శ్రీకాంత్ మరోసారి సత్తా చాటుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. రియో ఒలింపిక్స్ ముగిసిన తర్వాత అతను గతవారం జపాన్ సూపర్ సిరీస్‌లో పాల్గొని క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. సెమీస్‌లో స్థానం కోసం మార్క్ జీబ్లెర్‌తో చివరి వరకూ పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. కాగా, కొరియా ఓపెన్‌లో అతను అంతకంటే బాగా ఆడి, టైటిల్ రేసులో ముందు ఉంటాడని భారత అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలావుంటే, గాయం కారణంగా చాలాకాలం అంతర్జాతీయ టోర్నీలకు దూరమైన హైదరాబాదీ పారుపల్లి కశ్యప్ కూడా జపాన్ ఓపెన్‌లో పోటీపడ్డాడు. అయితే, అతను శ్రీకాంత్ చేతిలో ఓటమిపాలై నిష్క్రమించాడు. కశ్యప్‌ను గాయం వేధించడం లేదన్న వాస్తవం ఆ మ్యాచ్‌తో స్పష్టమైంది. కొరియా ఓపెన్‌లో అతను క్వాలిఫయర్‌ను మలేసియాకు చెందిన గో సూన్ హువత్‌తో ఆడతాడు.