క్రీడాభూమి

చివరి రెండు టెస్టులకు క్రెగ్ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, సెప్టెంబర్ 26: న్యూజిలాండ్ స్పిన్నర్ మార్క్ క్రెగ్ భారత్‌తో జరిగే చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు. వీపు కండరాలు బెణకడంతో అతను మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని కివీస్ జట్టు మేనేజ్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు అతను కంరాల నొప్పితో బాధపడ్డాడు. మైదానం విడిచి వెళ్లిపోయిన అతను మళ్లీ బౌలింగ్‌కు రాలేదు. అయితే, జట్టు అవసరాలను గుర్తించి బ్యాటింగ్‌కు దిగాడు. రెండు బంతులు ఆడి, ఒక పరుగు చేసి అవుటయ్యాడు. అతని గాయం తగ్గడానికి కనీసం మూడు వారాల సమయం పడుతుందని, అందుకే స్వదేశానికి వెళ్లి, అక్కడ చికిత్స పొందుతాడని జట్టు మేనేజ్‌మెంట్ తన ప్రకటనలో వివరించింది.
జతిన్‌కు చోటు
గాయం కారణంగా క్రెగ్ వైదొలగడంతో అతని స్థానంలో మరో స్పిన్నర్ జతిన్ పటేల్‌కు జట్టులో చోటు కల్పించారు. అతను మళ్లీ న్యూజిలాండ్ జాతీయ జట్టులోకి రావడం మూడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 2013లో అతను టెస్టు జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కేవలం ఈ ఫార్మెట్‌కే పనికొస్తాడని ముద్రపడడంతో అతనికి ఎక్కువగా అవకాశాలు రాలేదు. అయితే, ఇంగ్లీష్ కౌంటీలో అద్భుతంగా రాణించడంతో అతనికి మళ్లీ చోటు దక్కింది.
సుప్రీం కోర్టుకు ‘లోధా’ స్టేటస్ రిపోర్టు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఇటీవల నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం)లో తీసుకున్న నిర్ణయాలపై లోధా కమిటీ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నది. బోర్డు వైఖరిని వివరిస్తూ సుప్రీం కోర్టుకు స్టేటస్ రిపోర్టును సమర్పించాలని ఆర్‌ఎం లోధా నాయకత్వంలో, అశోక్ భాన్, ఆర్వీ రవీంద్రన్ సభ్యులుగా ఉన్న కమిటీ నిర్ణయించింది. సోమవారం ఇక్కడ సమావేశమైన కమిటీ సభ్యులు పలు అంశాలను చర్చించారు. కార్యదర్శి ఎన్నిక, సెలక్షన్ కమిటీ ఎంపిక వంటి అంశాల్లో తమ ప్రతిపాదనకు విరుద్ధంగా బోర్డు వ్యవహరించిందని తీర్మానించారు. బోర్డు ప్రక్షాళన కోసం తాము చేసిన సిఫార్సులను అమలు కాకపోవడానికి గల కారణాలను సుప్రీం కోర్టుకు సమర్పించే నివేదికలో పేర్కొంటామని సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడిన లోధా అన్నారు. సిఫార్సులను అమలు చేసేందుకు ఏవైనా ఇబ్బందులు ఉంటే, బోర్డు కూడా కోర్టుకు నివేదికను సమర్పించవచ్చని తెలిపారు. స్టేటస్ రిపోర్టులో ప్రస్తావించే అంశాలను వివరించడానికి నిరాకరించారు. తమ నివేదికలో పొందుపరచిన పలు సంస్కరణలను అమలు చేయడానికి బోర్డు ఎందుకు వెకంజ వేస్తున్నదో, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయో వివరిస్తామని, అంతకంటే ఎక్కువ సమాచారాన్ని ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

చిత్రం.. సమావేశంలో పాల్గొన్న ఆర్వీ రవీంద్రన్, అశోక్ భాన్, ఎంఆర్ లోధా