క్రీడాభూమి

గులాబీ బంతులతో టెస్టు ఈ సీజన్‌లో ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: గులాబీ బంతులతో టెస్టు మ్యాచ్ ఈ హోం సిరీస్ సీజన్‌లో ఉండదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశాడు. ఈ వరుస హోం సిరీస్‌లలో భాగంగా భారత్ మొత్తం 13 టెస్టులు ఆడాల్సి ఉండగా, మొదటి టెస్టు న్యూజిలాండ్‌తో కాన్పూర్‌లో ముగిసింది. వచ్చే ఏడాది మార్చి వరకూ కొనసాగే ఈ టెస్టు సిరీస్‌ల పరంపరలో ఒక మ్యాచ్‌ని డే/నైట్ ఈవెంట్‌గా మారుస్తారన్న ఊహాగానాలు వినిపించాడు. ఆ మ్యాచ్‌లోనే సంప్రదాయ సిద్ధమైన ఎర్ర బంతి స్థానంలోనే గులాబీ రంగు బంతిని వాడతారని బోర్డు వర్గాలు పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వాదనలకు ఠాకూర్ తెరదించాడు. తాజా హోం సిరీస్‌లో గులాబీ బంతులతో టెస్టును ఆడించాలన్న ఆలోచన బిసిసిఐకి లేదని అతను స్పష్టం చేశాడు. దులీప్ ట్రోఫీని డే/నైట్ ఈవెంట్‌గా మార్చి, గులాబీ బంతులతో ఆడించడం సత్ఫలితానే్న ఇచ్చిందని ఠాకూర్ చెప్పాడు. ఆ టోర్నీ ఘన విజయమైందని అన్నాడు. అయితే, టెస్టును కూడా మన దేశంలో డే/నైట్ మ్యాచ్‌గా నిర్వహించాలన్న విషయంపై తొందరపాటు నిర్ణయాలు ఉండవని తేల్చిచెప్పాడు. అన్ని కోణాల్లోనూ దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నాడు. టీవీలో మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం జరిగే సమయాల్లో గులాబీ బంతి ప్రేక్షకులకు స్పష్టంగా కనిపిస్తుందా లేదా? గులాబీ బంతులతో టెస్టులను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దగలుతామా? టెస్టు క్రికెట్‌పై పింక్ బాల్స్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉందన్నాడు. అన్ని రకాలుగా ఆలోచించి, అభిప్రాయాలు సేకరించి, అధ్యయనం చేసిన తర్వాతే గులాబీ బంతులతో స్వదేశంలో టీమిండియా టెస్టు మ్యాచ్‌లు ఆడే అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఠాకూర్ అన్నాడు.

చిత్రం.. ఠాకూర్‌