క్రీడాభూమి

ప్రతి నగరానికీ ఎంటర్‌టైనె్మంట్ రెజ్లింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, సెప్టెంబర్ 27: దేశంలోని ప్రతి నగరానికీ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైనె్మంట్ (డబ్ల్యుడబ్ల్యుఇ) తరహా ఫైట్స్‌ను పరిచయం చేయడమే తన లక్ష్యమని ‘ది గ్రేట్’ ఖలీ అన్నాడు. ఎంటర్‌టైనె్మంట్ రెజ్లింగ్‌లో ఖలీ పేరుతో సుప్రసిద్ధుడైన దలీప్ సింగ్ రాణా మంగళవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో హర్యానా క్రీడాశాఖ మంత్రి అనిల్ విజ్‌తో కలిసి విలేఖరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్‌టైనె్మంట్ (సిడబ్ల్యుఇ) పేరుతో వివిధ ప్రాంతాల్లో రెజ్లింగ్ పోటీలను నిర్వహించనున్నట్టు చెప్పాడు. అక్టోబర్ 9న గుర్‌గావ్‌లో, 12న పానిపట్‌లో సిడబ్ల్యుసి పోటీలు జరుగుతాయని ఏడు అడుగులా, రెండు అంగుళాల పొడవుతో ఒక కొండలా కనిపించే ఖలీ అన్నాడు. ఈ ఫైట్స్‌లో 15 మంది భారతీయులతోపాటు 35 మంది విదేశీ రెజ్లర్లు పాల్గొంటారని తెలిపాడు.
ఖలీకి హర్యానా సర్కారు నుంచి పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందిస్తామని అనిల్ విజ్ అన్నాడు. ఎంటర్‌టైనె్మంట్ రెజ్లింగ్‌లో భారత ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఖలీ తలపెట్టిన సిడబ్ల్యుఇ పోటీలకు తమ మద్దతు ఉంటుందన్నాడు. హర్యానా ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుందని చెప్పాడు.