క్రీడాభూమి

ఈ ఏడాదిలోగా బిఎఫ్‌ఐకి గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాసనే్న, సెప్టెంబర్ 27: భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్‌ఐ)కి ఈ ఏడాదిలోగానే గుర్తింపునిస్తామని అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) అధ్యక్షుడు డాక్టర్ చింగ్ కువో వూ స్పష్టం చేశాడు. ఇక్కడ అతను విలేఖరులతో మాట్లాడుతూ బిఎఫ్‌ఐ ఎన్నికలు నిబంధలను అనుసరించి జరిగాయని, ఎక్కడా అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోలేదని తమ తరఫున పరిశీలకుడిగా వెళ్లిన ఎడ్గర్ టన్నర్ తన నివేదికలో పేర్కొన్నట్టు చెప్పాడు. బిఎఫ్‌ఐకి గుర్తింపునివ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. లాంఛనాలు పూర్తి కావాల్సి ఉంటుందని, సర్వసభ్య సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత బిఎఫ్‌ఐ గుర్తింపును అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నాడు. భారత బాక్సింగ్ సంఘం అవినీతికి నిలయంగా మారడంతో, దానిని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం హాకీ ఇండియా (హెచ్‌ఐ)ని ఏర్పాటు చేసింది. అయితే, కోర్టు వివాదాలతోపాటు సభ్య సంఘాల నిరసనలు కూడా వెల్లువెత్తడంతో హెచ్‌ఐ గుర్తింపును ఎఐబిఎ రద్దు చేసింది. సుమారు నాలుగేళ్లుగా భారత బాక్సింగ్ సరైన సంఘం లేక సమస్యలను ఎదుర్కొంది. తాజాగా బిఎఫ్‌ఐ ఏర్పాటుతో ఎఐబిఎ సానుకూలంగా స్పందించింది. నిబంధనల ప్రకారం ఎన్నికలను జరపాలని ఆదేశించింది. ఉపాధ్యక్షుడు టన్నర్‌ను పరిశీలకుడిగా పంపింది. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో, భారత బాక్సింగ్‌కు గుర్తింపునివ్వాలని ఎఐబిఎ నిర్ణయించింది. ఈ ఏడాదిలోగా అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.