క్రీడాభూమి

విండీస్ జట్టులో స్పిన్నర్ వారికాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, సెప్టెంబర్ 27: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పాకిస్తాన్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో ఆడే విండీస్ జట్టుకు స్పిన్నర్ జోమెల్ వారికాన్ ఎంపికయ్యాడు. గత నెల భారత్‌తో జరిగిన మూడు, నాలుగు టెస్టుల్లో ఆడిన 14 మంది సభ్యులతో కూడిన జట్టులో వారికాన్‌కు స్థానం లభించింది. తన ప్రతిభతో సెలక్టర్లను ఆకట్టుకున్న వారికాన్‌కు మరోసారి అవకాశం దక్కింది. దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అక్టోబర్ 13 నుంచి మొదలయ్యే మొదటి టెస్టులో విండీస్, పాకిస్తాన్ జట్లు ఢీ కొంటాయి. ఈ రెండు జట్లకూ గులాబీ బంతులతో ఆడే మొట్టమొదటి డే/నైట్ టెస్టు అవుతుంది. రెండో టెస్టు అబూదబీలోని షేక్ జాయెద్ స్టేడియంలో అక్టోబర్ 21న ఆరంభమవుతుంది. చివరిదైన మూడో టెస్టు అక్టోబర్ 30 నుంచి షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.
పాక్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు
జాసన్ హోల్డర్ (కెప్టెన్), క్రెగ్ బ్రాత్‌వెయిట్, దేవేంద్ర బిషూ, జెర్మైన్ బ్లాక్‌వుడ్, కార్లొస్ బ్రాత్‌వెయిట్, డారెన్ బ్రేవో, రోస్టన్ చేజ్, మిగుల్ కమిన్స్, షేన్ డౌరిచ్, షానన్ గాబ్రియెల్, షాయ్ హోప్, లియాన్ జాన్సన్, అల్జారీ జోసెఫ్, మార్లొన్ సామ్యూల్స్, జోమెల్ వారికాన్.