క్రీడాభూమి

ఫిఫాకు ఎదురు దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, సెప్టెంబర్ 27: ప్రపంచ సాకర్‌ను శాసిస్తున్న అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా)కు ఎదురుదెబ్బ తగిలింది. ముందుగా ఖాయం చేసిన అజెండాకు వ్యతిరేకంగా ఆసియా ఫుట్‌బాల్ కానె్ఫడరేషన్ (ఎఎఫ్‌సి) తీర్మానాన్ని ఆమోదించడంతో, గతంలో ఎన్నడూ లేని రీతిలో ఫిఫా ఆత్మరక్షణలో పడింది. ఫిఫాలో ఆసియా నుంచి ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉండింది. ఇదే ప్రధాన అజెండాగా మంగళవారం ఎఎఫ్‌సి ఇక్కడ సమావేశమైంది. ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో కూడా దీనికి హాజరయ్యాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తవుతుందని ఇన్‌ఫాంటినోసహా అధికారులంతా భావించారు. అయితే, కతార్ అభ్యర్థి సవోద్ అల్ మొహన్నదీపై ఫిఫా అనర్హత వేటు వేయడంపై ఎఎఫ్‌సి సభ్యదేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అందుకే, మొత్తం 43 మంది ప్రతినిధులు హాజరుకాగా, ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు ఎన్నికలకు వెళ్లరాదన్న ప్రతిపాదనకు 42 మంది అనుకూలంగా ఓటు చేశారు. ఫలితంగా, అర గంటలోపే సమావేశం ముగిసింది. ఫిఫా అనుకున్నట్టు ఎఎఫ్‌సి నుంచి ముగ్గురు ప్రతినిధుల ఎన్నిక ప్రక్రియ పూర్తికాలేదు.
ఆసియా శక్తికి నిదర్శనం: ఖలీఫా
ఆసియా శక్తికి, ఐకమత్యానికి ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయమే నిదర్శనమని ఎఎఫ్‌సి అధ్యక్షుడు షేక్ సల్మాన్ బిన్ ఇబ్రహీం అల్ ఖలీఫా వ్యాఖ్యానించాడు. ‘ఇది చాలా అద్భుతమైన రోజు. సమావేశం 27 నిమిషాల్లోనే ముగిసినప్పటికీ, ఆసియా శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. ఇంత తక్కువ సమయంలో పూర్తయిన అసాధారణ సమావేశాన్ని ఫిఫా అధ్యక్షుడు ఇన్‌ఫాంటినో ఎక్కడా చూసి ఉండకపోవచ్చు. అదే సమయంలో ఇంతటి సంఘటిత శక్తి కూడా ఆయనకు ఎక్కడా కనిపించకపోవచ్చు’ అన్నాడు. కాగా, ప్రత్యేక సర్వసభ్య సమావేశం ముగిసిన వెంటనే ఎఎఫ్‌సి కార్యవర్గం అత్యవసరంగా సమావేశమైందని ఖలీఫా తెలిపాడు. అందులోనూ కతార్ అభ్యర్థిపై ఫిఫా నిషేధం విధించడంపై అసంతృప్తి వ్యక్తమైందని అన్నాడు. ఆసియా ఫుట్‌బాల్ ఐకమత్యం గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలిసిందని అన్నాడు. ఇది సంతోషించాల్సిన విషయమన్నాడు.
నిషేధం ఎత్తివేయాలని డిమాండ్
కతార్ అభ్యర్థి అల్ మొహన్నదీపై అనర్హత వేటు వేయడమేగాక, అతనిని రెండున్నర సంవత్సరాలు బహిష్కరించడంపై ఎఎఫ్‌సి సభ్య సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇలావుంటే, మళ్లీ జరగబోయే అసాధారణ సర్వసభ్య సమావేశం వరకూ చైనా ప్రతినిధి జాంగ్ జియాన్‌ను కార్యవర్గ సభ్యుడిగా తీసుకోవాలని ఎఎఫ్‌సి తీర్మానించింది. ప్రస్తుత సమావేశంలో ఎన్నికలను బహిష్కరించిన కారణంగా, తదుపరి సమావేశంలో అతని ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అంత వరకూ అతని తత్కాలిక సభ్యుడిగా ఉంటాడు.