క్రీడాభూమి

దారిలోకి వస్తారా.. దారికి తెచ్చుకోవాలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: పాలనా వ్యవహారాలన్నీ పారదర్శకంగా జరగాలన్న ఉద్దేశంతో లోధా కమిటీ చేసిన సిఫార్లును అమలుచేయడానికి నిరాకరిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)పై సుప్రీం కోర్టు మండిపడింది. లోధా కమిటీ బుధవారం సమర్పించిన స్టేటస్ రిపోర్టులపై తీవ్రంగా స్పందించిన కోర్టు ఇప్పటికైనా దారిలోకి రావాలని సూచించింది. ఇదే విధంగా మొండి వైఖరిని కొనసాగిస్తే, దారిలోకి తెచ్చుకోవడం ఎలాగో తమకు తెలుసునని వ్యాఖ్యానించింది. అవసరమైతే కఠినతరమైన ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని న్యాయమూర్తులు టిఎస్ ఠాకూర్, ఇబ్రహీం ఖలీఫుల్లాతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం హెచ్చరించింది. ‘మీరు దారిలోకి వస్తారా లేక మమ్మల్ని తెచ్చుకోమంటారా’ అని నిలదీసింది. క్రికెట్ బోర్డు పారదర్శకంగా నడవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయకుండా తాత్సారం చేయడమేగాక, వాటిని అతిక్రమించే రీతిలో వ్యవహరించడం సరైన విధానం కాదని మండిపడింది. ఇదే వైఖరిని కొనసాగిస్తే, కఠినంగా వ్యవహరించక తప్పదని స్పష్టం చేసింది. లోధా కమిటీ స్టేటస్ రిపోర్డు
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో భారత క్రికెట్ పాలనా వ్యవహారాలను పారదర్శకంగా నిర్వహించే దిశగా సుప్రీం కోర్టు చర్యలు ఆరంభించింది. అందులో భాగంగానే లోధా కమిటీని నియమించింది. ఈ కమిటీ అన్ని కోణాల్లోనూ సమస్యను పరిశీలించి, అధ్యయనం చేసిన తర్వాత నివేదికను సమర్పించింది. అందులో పలు కీలక ప్రతిపాదనలు చేసింది. వాటిని తు.చ తప్పకుండా అమలు చేయాలని బిసిసిఐకి సుప్రీం కోర్టు ఇది వరకే ఆదేశించింది. అయితే, రివ్యూ పిటిషన్ వేసి, తాత్కాలికంగా గండం నుంచి బయటపడిన బోర్డుకు లోధా కమిటీ విధించిన గడువు తలనొప్పి వ్యవహారంగా మారింది. వచ్చేనెల ఆరో తేదీలోగా మార్పుల ప్రక్రియ ఆరంభంకావాలని లోధా కమిటీ తేల్చిచెప్పినప్పటికీ బిసిసిఐ ఆ దశగా చర్యలు మొదలు పెట్టలేదు. అంతేగాక, ఇటీవల జరిగిన అసాధారణ సర్వసభ్య సమావేశం (ఎజిఎం)లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంది. అంతేగాక, సెలక్షన్ కమిటీలో ముగ్గురు సభ్యులను మాత్రమే బోర్డు ఎంపిక చేయాలని లోధా కమిటీ స్పష్టం చేసినప్పటికీ ఐదుగురు సభ్యులతో కమిటీని ఎంపిక చేసింది. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన లోధా కమిటీ సుప్రీం కోర్టుకు స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించింది. సిఫార్సులను అమలు చేయకుండా బోర్డు ఏ విధంగా జాప్యం చేస్తున్నదీ వివరించింది. అంతేగాక, సిఫార్సులకు విరుద్ధంగా వ్యవహరిస్తునన్న తీరును కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఏకపక్ష నిర్ణయాలతో సుప్రీం కోర్టు ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తున్న బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, ప్రధాన కార్యదర్శి అజయ్ షిర్కేసహా పాలకమండలిలోని సభ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరింది. కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్న బోర్డు పాలకులకు ఆయా హోదాల్లో కొనసాగే హక్కు లేదని వ్యాఖ్యానించింది.
గతంలోనూ..
బోర్డును సుప్రీం కోర్టు మందలించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో చీవాట్లు వేసింది. లోధా సిఫార్సులోని ప్రధాన అంశాలను ప్రస్తావిస్తూ, వాటిని అమలు చేయడంలో వచ్చే ఇబ్బందులు ఏమిటో చెప్పాలని సూచించింది. క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాల్లో మంత్రుల అవసరం ఏమిటని నిలదీసింది. బోర్డు కార్యవర్గంలో మంత్రులకు చోటు కల్పించవద్దని లోధా కమిటీ చేసిన సూచనలో తప్పేముందని ప్రశ్నించింది. కోట్లాది రూపాయల లావాదేవీలను స్వతంత్రంగా చూసుకుంటూ, ఎవరికీ జవాబుదారి వహించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉండాలనుకుంటే కుదరదని తేల్చిచెప్పింది. కమిటీ సమర్పించిన నివేదికలోని పలు అంశాలు ఆచరణలో కష్టమని, వాటిని అమలు చేయడం అసాధ్యమని విచారణ సమయాల్లో బిసిసిఐ లేవనెత్తిన అభ్యంతరాలను తప్పుపట్టింది. బోర్డు కార్యవర్గ సభ్యులకు గరిష్ట వయోపరిమితిని ఉంటే నష్టం ఏమిటని అడిగింది.
పసలేని వాదనలు..
లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడంలో తలెత్తే ఇబ్బందులపై సుప్రీం కోర్టు ముందు వివిధ దశల్లో బిసిసిఐ లేవనెత్తిన అభ్యంతరాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. కోర్టులో బోర్డు పసలేని వాదనలను వినిపిస్తున్నది. లోధా నాయకత్వంలో అశోక్ భాన్, ఆర్వీ రవీంద్రన్ సభ్యులుగా ఉన్న త్రిసభ్య కమిటీ చేసిన ప్రతిపాదనలు ఆచరణ యోగ్యంగా లేవని పదేపదే పేర్కొంటున్నప్పటికీ, సరైన వివరణ ఇవ్వలేకపోతున్నది. వాస్తవానికి, బోర్డు అధికారులతో లోధా కమిటీ సభ్యులు 38 పర్యాయాలు సమావేశమయ్యారు. ఆతర్వాతే కమిటీ 159 పేజీల నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. అందులోని అంశాలే బోర్డుకు తలనొప్పిగా మారాయి. సిఫార్సులను అమలు చేస్తే, భారత క్రికెట్‌పై ఉన్న ఆధిపత్యం ఎక్కడ పోతుందోనని బోర్డు భయపడుతున్నది. పాలనా వ్యవహారాలు పారదర్శకంగా ఉండాల్సిన అవసరం లేదా? అని సుప్రీం కోర్టు ప్రశ్నిస్తే, ఆ బాధ్యతను తాము తీసుకుంటామని అర్ధం లేని సమాధానమిస్తున్నది. ప్రజలకు జవాబుదారీ వహించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి వీల్లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేస్తే, వ్యాపారేతర సంస్థగా రిజిస్టరైంది కాబట్టి ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని వాదించింది. ఈ వైఖరే అటు లోధా కమిటీకి, ఇటు సుప్రీం కోర్టుకు ఆగ్రహం తెప్పిస్తున్నది. ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో కమిటీ సిఫార్సులను తుంగలోకి తొక్కడం ద్వారా బిసిసిఐ తన గోతిని తానే తవ్వుకుంది. సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురైంది. దారిలోకి రాకపోతే, దారికి తెచ్చుకుంటామని ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ చేసిన హెచ్చరికే బోర్డు పరిస్థిని వివరిస్తున్నది.

చట్టానికి అతీతం కాదు..
* బిసిసిఐ అత్యున్నత సంస్థ ఏమీకాదని, తానే చట్టంగా వ్యవహరించడం బోర్డుకు సరికాదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. ‘బోర్డు చట్టానికి అతీతం అనుకుంటున్నది. లోధా సిఫార్సులను అమలు చేయమని చెప్పినా పట్టించుకోవడం లేదు. మాట వినకపోతే, సిఫార్సులను ఏ విధంగా అమలు చేయించాలో మాకు తెలుసు. తక్షణమే సరైన దారిలో బిసిసిఐ నడవాలి. లేకపోతే, దారిలోకి తెచ్చుకుంటాం’ అన్నారు. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడంలో బోర్డు ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నదన్న అనుమానం వ్యక్తం చేశారు. అక్టోబర్ ఆరోతేదీలోగా సిఫార్సుల అమలుపై స్పష్టతనివ్వాలంటూ గడువు విధించారు.