క్రీడాభూమి

ఆసీస్ బౌలర్లకు పరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, సెప్టెంబర్ 29: దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ ఆస్ట్రేలియా బౌలింగ్‌కు పరీక్ష పెట్టనుంది. శుక్రవారం జరిగే మొదటి వనే్డలో ఆసీస్ తరఫున ముగ్గురు కొత్త ఫాస్ట్ బౌలర్లు బరిలోకి దిగడమే అందుకు కారణం. డానియల్ వోరల్ ఇప్పటికే ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటాడు. క్రిస్ ట్రెమెన్, జో మెనీ కూడా సమర్థులైన బౌలర్లుగా ఎదుగుతున్నారు. అయితే, పటిష్టమైన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్‌ను వీరు ఏ విధంగా దెబ్బతీస్తారో చూడాలి. జట్టులో జాన్ హాస్టింగ్స్ ఒక్కడే అనుభవజ్ఞుడైన బౌలర్. స్కాట్ బోలాండ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ జట్టులో ఉన్నప్పటికీ, వారికి టెస్టుల్లో అనుభవం లేదు. పేసర్లు మిచెల్ స్టార్క్, జొష్ హాజెల్‌వుడ్‌లకు విశ్రాంతినివ్వగా, నాథన్ కౌల్టర్ నైల్, జేమ్స్ పాటిన్సన్, పాట్ కమిన్స్, జేమ్స్ ఫాల్క్‌నెర్, పీటర్ సిడిల్ గాయాలతో బాధపడుతున్నారు. అందుకే, కొత్త బౌలర్లకు జట్టులో స్థానం దక్కింది.
కాగా, ఆడం జంపా రూపంలో ఆసీస్‌కు ఒక స్పిన్నర్ ఉన్నాడు. ఇలావుంటే, దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఎబి డివిలియర్స్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. జట్టుకు క్వింటన్ డికాక్ నాయకత్వం వహిస్తుండగా, అతనితోపాటు హషీం ఆమ్లా, ఫఫ్ డు ప్లెసిస్ కూడా అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ జాబితాలో ఉన్నారు. వీరిని కట్టడి చేయడం ఆస్ట్రేలియా యువ బౌలర్లకు సులభసాధ్యం కాకపోవచ్చు. ఈ సిరీస్‌లో భాగంగా మిగతా నాలుగు వనే్డలు అక్టోబర్ 2 (జొహానె్నస్‌బర్గ్), 5 (దర్బన్), 9 (పోర్ట్ ఎలిజబెత్), 12 (కేప్ టౌన్)లలో జరుగుతాయి.