క్రీడాభూమి

అమీర్‌కు వీసా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, జనవరి 7: స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయి, ఆరు నెలల జైలు శిక్షను, ఐదేళ్ల సస్పెన్షన్‌ను ఎదుర్కొన్న పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ అంతర్జాతీయ కెరీర్‌లో రెండు ఇన్నింగ్స్‌కు రంగం సిద్ధమైంది. అతనికి న్యూజిలాండ్ అధికారులు వీసా మంజూరు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రవర్తన విషయంలో అనుమానాలు ఉన్నాయంటూ అతనికి వీసా ఇవ్వరాదని కివీస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు తొలుత అనుకున్నట్టు సమాచారం. అయితే, అమీర్ సస్పెన్షన్ కాలాన్ని పూర్తి చేసుకోవడం, బేషరతుగా క్షమాపణలు కోరడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని అతనికి వీసాను మంజూరు చేశారని తెలుస్తున్నది. అంతేగాక, ఇరుదేశాల క్రికెట్ బోర్డుల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఈ చర్య ఉపకరిస్తుందని కివీస్ అధికారులు భావించారని, అందుకే అమీర్‌కు వీసాను మంజూరు చేశారని వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ విషయంపై ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో అమీర్ పునరాగమనం ఇప్పటికే దాదాపుగా ఖరారైంది. న్యూజిలాండ్‌లో పర్యటించే పాకిస్తాన్ జట్టులో అతనికి స్థానం లభించింది. వీసా కూడా లభిస్తే, అతను మళ్లీ కెరీర్‌ను ప్రారంభిస్తాడు.
ఆహ్వానించాలి: మెక్‌కలమ్
మహమ్మద్ అమీర్‌కు పాకిస్తాన్ జాతీయ జట్టులో తిరిగి స్థానం సంపాదించుకోవడానికి ఆహ్వానించాలే తప్ప విమర్శించకూడదని వచ్చేనెల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌కానున్న న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినప్పుడు అతని వయసు కేవలం 18 సంవత్సరాలేనన్న విషయాన్ని మరచిపోకూడదని ఒక ఇంటర్వ్యూలో మెక్‌కలమ్ పేర్కొన్నాడు. పునరావాస కార్యక్రమానికి కూడా హాజరైన అమీర్ పూర్తిగా మారిపోయాడన్న నమ్మకం ఉండడం వల్లే సెలక్టర్లు అతనిని జాతీయ జట్టుకు ఎంపిక చేశారని అన్నాడు.