క్రీడాభూమి

‘ఈడెన్’లో గంట కొట్టిన కపిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 30: ‘క్రికెట్ మక్కా’గా పిలిచే లార్డ్స్ మైదానంలో టెస్టు మ్యాచ్‌లను గంట కొట్టి ఆరంభిస్తారు. స్వదేశంలో భారత్ 250వ టెస్టు ఆడుతున్నందున, కోల్‌కతా మ్యాచ్‌లో అదే విధానాన్ని అనుసరించారు. భారత్‌కు మొట్టమొదటిసారి వనే్డ ప్రపంచ కప్ టైటిల్‌ను సాధించిపెట్టిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌కు ఈ అవకాశం దక్కింది. మరో మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం (సిఎబి) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెంటరాగా, భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టును కపిల్ గంట గొట్టి మొదలుపెట్టాడు.
ధావన్ విఫలం: వేగంగా పరుగులు రాబట్టే ఓపెనర్‌గా పేరు సంపాదించిన శిఖర్ ధావన్ మరోసారి అభిమానులను నిరాశ పరిచాడు. కెరీర్‌లో ఆడిన తొలి టెస్టులోనే 187 పరుగులు చేసి సంచలనం సృష్టించిన అతను ఆతర్వాత స్వదేశంలో ఆడిన 11 ఇన్నింగ్స్‌లో కలిపి 207 (సగటు 23) పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ పదకొండు ఇన్నింగ్స్‌లో అతని అత్యధిక స్కోరు 45 (నాటౌట్) పరుగులు.