క్రీడాభూమి

హెడింగ్లే టెస్టు విజయం చిరస్మరణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 30: తన కెరీర్‌లో చిరస్మణీయంగా గుర్తుంచుకునే మ్యాచ్‌లు చాలానే ఉన్నాయని, అయితే, 2002లో ఇంగ్లాండ్‌తో హెడింగ్లేలో జరిగిన టెస్టును అన్నిటి కంటే ముందుగా ప్రస్తావించాల్సి ఉంటుందని భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లే అన్నాడు. ఆ మ్యాచ్‌లో 46 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేశామని, ఒక రకంగా భారత్ ప్రపంచ నంబర్ వన్ టెస్టు జట్టుగా ఎదగడానికి ఆ గెలుపే ప్రధాన కారణమని అన్నాడు. తన కెరీర్ చివరిలో జట్టుకు నాయకత్వం వహించే అవకాశం దక్కిందని చెప్పాడు. ‘గంగూలీ కెప్టెన్సీ ముగిసింది. సెవాగ్ జట్టులో లేదు. రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీపై ఆసక్తి చూపలేదు. ధోనీకి అప్పట్లో అనుభవం లేదు. అందుకే జట్టుకు సారథ్యం వహించే బాధ్యత నాకు లభించింది. కెప్టెన్‌గా నా కెరీర్ చాలా చిన్నదని నాకు ముందుగానే తెలుసు. కానీ, సాధ్యమైనంత వరకూ ఉత్తమ సేవలు అందించేందుకు ప్రయత్నించాను’ అన్నాడు. సెవాగ్ బ్యాటింగ్ విధానాన్ని కుంబ్లే ప్రశంసించాడు. ఒక రకంగా భారత బ్యాటింగ్ తీరుతెన్నులను అతనే మార్చేశాడని చెప్పాడు.