క్రీడాభూమి

సచిన్‌కు దుస్తులంటే పిచ్చి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 30: ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్‌కు కొత్తకొత్త దుస్తులు కొనడం చాలా ఇష్టం. బాగా ఆడిన ప్రతిసారీ అతను బట్టల దుకాణాలకు వెళ్లి షాపింగ్‌లో నిమగ్నమయ్యేవాడు. ‘పరుగులు సాధించి.. కొత్తకొత్త దుస్తులు కొను..’ అన్న సూత్రాన్ని అతను అనుసరించాడు. ఈ వివరాలను భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. స్వదేశంలో జరుగుతున్న 250వ టెస్టు మ్యాచ్ ప్రారంభాన్ని పురస్కరించుకొని జరిగిన కార్యక్రమంలో అతను మాట్లాడుతూ సచిన్ ఎప్పుడూ కొత్త దుస్తులు కొనేవాడని, అతని ఆల్మరా మొత్తం వాటితో నిండిపోయేదని చెప్పాడు. హైదరాబాద్ స్టయిలిస్ట్ బ్యాట్స్‌మన్ వివిఎస్ లక్ష్మణ్ గురించి ప్రస్తావిస్తూ, అతను చాలా బద్దకస్తుడని అన్నాడు. ‘ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాల్సి ఉన్నప్పటికీ, అతను చాలా నింపాదిగా స్నానానికి వెళ్లేవాడు. క్రీజ్‌లో నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన వారు ఆడుతున్నా పట్టించుకునేవాడు కాదు. ప్రతిసారీ జట్టు ప్రయాణించే వాహనంలో అందరి కంటే చివరగా ఎక్కేవాడు కూడా అతనే’ అన్నాడు. వీరేందర్ సెవాగ్ పరుగుల వరద పారించేవాడని, అనిల్ కుంబ్లే వికెట్ల మీద వికెట్లు పడగొట్టేవాడని అన్నాడు. భారత్ సాధించిన ఎన్నో విజయాల్లో వీరు కీలక పాత్ర పోషించారని గంగూలీ అన్నాడు. ‘సచిన్, సెవాగ్, కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, హర్భజన్ సింగ్ వంటి ఎంతో మంది హేమాహేమీలు ఉన్న జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించడం నా అదృష్టం. నేను పరుగులు సాధిస్తే, తాను వికెట్లు ఇస్తానని కుంబ్లే ఎప్పుడూ అంటూ ఉండేవాడు. నిజంగానే అతను ఆదే స్థాయిలో వికెట్లు కూల్చాడు’ అన్నాడు. బ్యాటింగ్‌లో కొత్త ఒరవడిని సృష్టించిన ఆటగాడిగా సెవాగ్‌ను అభివర్ణించాడు. సెవాగ్, మాథ్యూ హేడెన్ వంటి క్రికెటర్ల కారణంగానే బ్యాటింగ్ కొత్త పుంతలు తొక్కిందన్నాడు. ఇప్పుడు ఎవరైనా సరిగ్గా బ్యాటింగ్ చేయకపోతే విమర్శలకు గురవుతారని, సెవాగ్ ప్రవేశపెట్టిన ప్రమాణాలే అందుకు కారణమని గంగూలీ పేర్కొన్నాడు. 2001లో ఆస్ట్రేలియాతో ఇదే స్టేడియంలో జరిగిన చారిత్రక టెస్టులో భారత్ ఫాల్‌ఆన్ ఆడినప్పటికీ, ఆతర్వాత విజయం సాధించిన సంఘటనను గంగూలీ గుర్తు చేసుకున్నాడు. అప్పుడు జట్టులో కుంబ్లే లేడని, అయితే, హర్భజన్ అద్భుతంగా రాణించాడని అన్నాడు.