క్రీడాభూమి

అస్వస్థతకు గురైన పుజారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, అక్టోబర్ 1: టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా ఫ్లూ వ్యాధితో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతను కోల్‌కతాలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండవ రోజైన శుక్రవారం మైదానంలోకి దిగలేదు. అయితే పుజారా ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఏమీ లేదని, టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో అతను యథావిధిగా మూడో స్థానంలోనే బరిలోకి దిగుతాడని జట్టు వర్గాలు తెలిపాయి. ‘్ఫ్ల వ్యాధితో పుజారా అస్వస్థకు గురవడంతో ముందు జాగ్రత్త చర్యగా విశ్రాంతి కల్పించాం. అతని ఆరోగ్య పరిస్థితి మరీ అంత ఆందోళనకరంగా ఏమీ లేదు’ అని భారత జట్టు అధికారి ఒకరు చెప్పారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పుజారా 87 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన విషయం విదితమే. అయితే శుక్రవారం పుజారా బరిలోకి దిగకపోవడంతో మైదానంలో అతనికి బదులుగా కొద్దిసేపు గౌతమ్ గంభీర్, మరికొద్దిసేపు ఉమేష్ యాదవ్ ఫీల్డింగ్ చేస్తూ కనిపించారు.