క్రీడాభూమి

ధైర్యంగా ముందుకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, అక్టోబర్ 2: భద్రతాపరమైన అనుమానాలు తలెత్తినప్పటికీ, ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ధైర్యంగా ముందడుగు వేసింది. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లు ఆడేందుకు ఢాకా చేరుకుంది. వనే్డ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, బ్యాట్స్‌మన్ అలెక్స్ హాలెస్ టూర్‌కు నిరాకరించినప్పటికీ, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) ఈ టూర్‌ను కొనసాగించాలని నిర్ణయించడం విశేషం. అక్కడ తమ జట్టుకు ఎలాంటి ప్రమాదం ఉండదని ఇసిబి నమ్ముతున్నది.
కట్టుదిట్టమైన భద్రత
తమ దేశంలో పర్యటించనున్న ఇంగ్లాండ్ జట్టుకు కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తామన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) హామీ ఇచ్చింది. ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్ అలిస్టర్ కుక్ ఈ టూర్‌లో పాల్గొంటున్నప్పటికీ, పరిమిత ఓవర్ల ఫార్మెట్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాత్రం నిరాకరించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో పర్యటించడానికి ససేమిరా అన్న అతను వచ్చే ఏడాది భారత్ పర్యటనకు అతను సిద్ధంగా ఉంటానని ప్రకటించడం గమనార్హం. భద్రతా పరమైన అనుమానాలు ఉన్నాయని, అందుకే తాను బంగ్లాదేశ్ టూర్ నుంచి వైదొలగుతున్నానని మోర్గాన్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ టూర్‌పై స్పష్టత ఇవ్వాలని, ఒకవేళ నిరాకరిస్తే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని ఇసిబి డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ క్రికెటర్లకు అల్టిమేటం జారీ చేసినప్పటికీ మోర్గాన్ పట్టించుకోలేదు. కాగా, బ్యాట్స్‌మన్ అలెక్స్ హాలెస్ కూడా మోర్గాన్ దారిలోనే నడిచాడు. అతను కూడా బంగ్లా టూర్‌కు అందుబాటులో ఉండనని స్పష్టం చేశాడు. ఈ పర్యటనకు ఎవరైనా గైర్హాజరైతే వారి అంతర్జాతీయ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశాలు లేకపోలేదని స్ట్రాస్ హెచ్చరించినప్పటికీ మోర్గాన్, హాలెస్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.
బంగ్లాదేశ్‌లోని ఇస్లామిక్ తీవ్రవాదులు ఈ ఏడాది జూలై మాసంలో దాడికి తెగబడి, బందీలుగా పట్టుకున్న 20 మందిని క్రూరంగా హతమార్చారు. వీరిలో ఎక్కువ మంది విదేశీయులు. ఈ సంఘటనతో ప్రపంచ దేశాలు ఆందోళనకు గురయ్యాయి. ఇంగ్లాండ్ క్రికెటర్లు బంగ్లాదేశ్ టూర్‌పై అనుమానాలు వ్యక్తం చేయడంతో ఇసిబి రంగంలోకి దిగింది. భద్రతా విభాగం చీఫ్ రెగ్ డిక్సన్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్‌కు అధ్యయన బృందాన్ని పంపింది. అక్కడి పరిస్థితులు టూర్‌కు అనుకూలంగానే ఉన్నట్టు ఈ బృందం స్పష్టం చేయడంతో బంగ్లాదేశ్ టూర్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఇసిబి ప్రకటించింది. కాగా, ఇంగ్లాండ్ జట్టు ఎలాంటి భయాందోళనలు లేకుండా టూర్‌కు రావచ్చని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని బిసిబి ప్రకటించింది. భద్రతా సమస్యలేవీ తలెత్తవని హామీ ఇచ్చింది.
రేపు ప్రాక్టీస్ మ్యాచ్
బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్ మంగళవారం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. అనంతరం మూడు వనే్డ ఇంటర్నేషనల్స్, రెండు టెస్టుల్లో పాల్గొంటుంది. మూడు వనే్డలు 7, 9, 12 తేదీల్లో జరుగుతాయి. మొదటి రెండు వనే్డలకు మీర్పూర్ ఆతిథ్యమిస్తుంది. చివరిదైన మూడో వనే్డ చిట్టగాంగ్‌లో జరుగుతుంది. అనంతరం 14-15 తేదీల్లో మొదటి, 16-17 తేదీల్లో రెండవ వామప్ మ్యాచ్‌ల్లో పాల్గొంటుంది. మొదటి టెస్టు 20 నుంచి 24వ తేదీ వరకూ చిట్టగాంగ్‌లో, చివరిదైన రెండో టెస్టు 28 నుంచి నవంబర్ ఒకటో తేదీ వరకు మీర్పూర్‌లో జరుగుతాయి. అనంతరం, భారత్‌లో ఇంగ్లాండ్ జట్టు వచ్చే ఏడాది ఐదు టెస్టులు, 3 వనే్డలు, 3 టి-20 ఇంటర్నేషనల్స్ ఆడుతుంది.