క్రీడాభూమి

‘మలేసియా’ విజేత రిసియార్డో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెపాంగ్, అక్టోబర్ 2: రెడ్ బుల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా డ్రైవర్ డానియల్ రిసియార్డో ఇక్కడ జరిగిన మలేసియా గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అతను లక్ష్యాన్ని ఒక గంటా, 37 నిమిషాల, 12.776 సెకన్లలో పూర్తి చేశాడు. అతని సహచరుడు మాక్స్ వెర్‌స్టాపెన్ (నెదర్లాండ్స్) ఒక గంటా, 37 నిమిషాల, 15.219 సెకన్లలో గమ్యాన్ని చేరి, రెండో స్థానంలో రేస్‌ను ముగించాడు. మెర్సిడిజ్ డ్రైవర్ నికో రోజ్‌బర్గ్ (జర్మనీ) ఒక గంట, 38 నిమిషాల, 38.291 సెకన్లతో మూడో స్థానాన్ని ఆక్రమించాడు.

నాకే ఎందుకిలా?

ప్రతిసారీ కారు ఇంజన్ సమస్యలు సృష్టించడం తననే ఎందుకు వేధిస్తున్నదో అర్థం కావడం లేదని ప్రపంచ చాంపియన్, మెర్సిడిజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ వాపోయాడు. వాహనం మొరాయించడంతో అతను మలేసియా గ్రాండ్ ప్రీ రేస్‌ను పూర్తి చేయలేకపోయాడు. తీవ్ర నిరాశకు గురైన అతను కారు సాంకేతిక సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై విచారణ జరిపించాలని కోరాడు. ఇతరులు ఎవరికీ లేని విధంగా ఈ సమస్య తనను మాత్రమే వేధించడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు. కుట్ర కోణంలో దీనిని స్వీకరించి విచారణ జరిపించాలని కోరాడు.

మలేసియా గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్‌ను గెల్చుకున్న రెడ్ బుల్ డ్రైవర్ డానియల్ రిసియార్డో