క్రీడాభూమి

ఇక్బాల్ శతకం అఫ్గాన్‌పై బంగ్లాదేశ్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్పూర్, అక్టోబర్ 2: అఫ్గానిస్థాన్‌తో జరిగిన చివరి, మూడో వనే్డ ఇంటర్నేషనల్‌ను బంగ్లాదేశ్ 141 పరుగుల భారీ తేడాతో గెల్చుకొని, సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. ఓపెన్ తమీబ్ ఇక్బాల్ (118 బంతుల్లో 118 పరుగులు) శతకంతో రాణించగా, షబ్బీర్ రహ్మాన్ (65) కూడా చక్కటి ప్రతిభ కనబరిచాడు. వీరి బ్యాటింగ్ నైపుణ్యంతో బంగ్లాదేశ్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 279 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 33.5 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. నౌరోజ్ మంగల్ (33), రహ్మత్ షా (36) తప్ప మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో మొష్రాఫ్ హొస్సేన్ 24 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. తస్కిన్ అహ్మద్‌కు రెండు వికెట్లు లభించాయి. కాగా, తమీమ్ ఇక్బాల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఆవార్డులు లభించాయి.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 279 ఆలౌట్ (తమీమ్ ఇక్బాల్ 118, సబ్బీర్ రహ్మాన్ 65, మొహమ్మద్ నబీ 2/42, మిర్వాస్ అష్రాఫ్ 2/43, రషీద్ ఖాన్ 2/39).
అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్: 33.5 ఓవర్లలో 138 ఆలౌట్ (నౌరోజ్ మంగల్ 33, రహ్మత్ షా 36, నజీబుల్లా జద్రాన్ 26, మొష్రాఫ్ హొస్సేన్ 3/24, తస్కిన్ అహ్మద్ 2/31).