క్రీడాభూమి

అట్లెటికో, చెనె్నయన్ మ్యాచ్ డ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, అక్టోబర్ 2: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో భాగంగా రవీంద్ర సరోవర్ స్టే డియంలో ఆదివారం స్థానిక అట్లెటికో డి కోల్‌కతా, చెనె్నయన్ మధ్య ఆరంభంలో నిరాసక్తంగా, చివరిలో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ 2-2గా డ్రా అయంది.
ఇరు జట్లు ఆరంభం నుంచి రక్షణాత్మక విధానాన్ని అనుసరించడంతో ప్రథమార్ధంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఒకరి ప్రయత్నాలను మరొకరు అడ్డుకుంటూ, పూర్తి డిఫెన్స్‌తో మ్యాచ్ కొనసాగడం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. ద్వితీయార్ధం ప్రారంభంలోనూ అదే పరిస్థితి కొనసాగింది. చెనె్నయన్‌పై స్థానిక జట్టు అట్లెటికో విజృంభిస్తుందని ఆశించిన ప్రేక్షకులు పూర్తిగా నీరుగారిపోయారు. అయతే, 59వ నిమిషంలో డెడ్‌లాక్‌కు అట్లెటికో ఆటగాడు సమీగ్ దౌతీ తెరదించాడు. చెనె్నయన్ గోల్‌కీపర్‌ను ఏమారుస్తూ అతని చక్కటి గోల్ చేసి, అట్లెటికోకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయతే, మరో పది నిమిషాల్లోనే జయంత్ రాణే ద్వారా చెనె్నయ న్‌కు ఈక్వెలైజర్ లభించింది. అనంతరం నాలుగు నిమిషాల్లో చెనెన్నయన్‌ను హన్స్ వౌల్డర్ 2-1 ఆధిక్యంలో నిలబెట్టాడు. కానీ, 86వ నిమిషంలో హ్యూమ్ ద్వారా అట్లెటికోకు ఈక్వెలైజర్ దక్కింది. చెరి రెండు గోల్స్ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

అభిమాని హల్‌చల్
మీర్పూర్, అక్టోబర్ 2: అఫ్గానిస్థాన్‌తో జరిగిన చివరి వనే్డలో బంగ్లాదేశ్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఓ అభిమాని భద్రతా సిబ్బంది కళ్లుగప్పి లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి కెప్టెన్ మష్రాఫ్ మొర్తాజాను ఆలింగనం చేసుకున్నాడు. వెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది ఆ ఆగంతకుడుని లాగివేయడానికి ప్రయత్నించారు. అయితే మొర్తాజా వారిని వారించి, ఆ అభిమానితో కరచాలనం చేసి మరీ అతనిని పంపించాడు. బంగ్లాదేశ్‌లో భద్రతాపరమైన అనుమానాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ సంఘటన సంచలనం రేపింది. భద్రత కట్టుదిట్టంగా లేదన్న విమర్శలకు అవకాశం కల్పించింది.