క్రీడాభూమి

ఇరాక్‌కు టైటిల్ ఫుట్‌బాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్గోవా, అక్టోబర్ 2: ఆసియా ఫుట్‌బాల్ కానె్ఫడరేషన్ అండర్-16 టైటిల్‌ను ఇరాక్ గెల్చుకుంది. పెనాల్టీ షూటౌట్ లో ఈ జట్టు ఇరాన్‌ను 4-3 గోల్స్ తేడాతో ఓడించింది. నిర్ణీ త 90 నిమిషాలు ముగిసే సమయానికి ఇరు జట్లు ఒక్క గో ల్ కూడా చేయలేకపోయాయ. ఫలితాన్ని తేల్చడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. అందులో ఇరాక్ నాలుగు గోల్స్ సాధించగా ఇరాన్ మూడు గోల్స్ చేసింది.
దక్షిణాఫ్రికాను గెలిపించిన డుప్లెసిస్
జొహానె్నస్‌బర్గ్, నవంబర్ 2: ఆస్ట్రేలియాతో ఆదివారం జ రిగిన రెండో వనే్డలో ఫఫ్ డు ప్లెసిస్ సెంచరీ సాధించి, దక్షి ణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లకు 361 పరుగుల భారీ స్కోరు సాధించగా సమాధానంగా ఆసీస్ 37.4 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌ టైంది. దక్షిణాఫ్రికా 142 పరుగుల తేడాతో గెలిచింది.

తాల్ స్మారక చెస్
రేసులోనే ఆనంద్
మాస్కో, అక్టోబర్ 2: భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఇక్కడ జరుగుతున్న తాల్ స్మారక చెస్ టోర్నమెంట్‌లో మళ్లీ రేసులోకి వచ్చేశాడు. కీలకమైన ఐదో రౌండ్‌లో అతను ఇజ్రాయిల్ ఆటగాడు బోరిస్ గెల్ఫాండ్‌ను ఓడించాడు. ఈ రౌండ్‌ను కోల్పోతే, ఆనంద్ టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించేవాడు. తర్వాతి గేమ్స్ ఫలితాలతో సంబంధం లేకుండా అతని తిరుగు ప్రయాణం ఖాయమయ్యేది. కానీ, ఈ గేమ్‌ను గెల్చుకోవడం ద్వారా అతను టైటిల్ రేసులో కొనసాగుతున్నాడు. కాగా, ఐదో రౌండ్‌లో మిగతా నాలుగు గేమ్‌లు డ్రాగా ముగిశాయి. నెదర్లాండ్స్‌కు చెందిన అనీష్ గిరి మొత్తం నాలుగు పాయింట్లతో అగ్రస్థానలో కొనసాగుతున్నాడు.

ధావన్ చేతికి
గాయం
కోల్‌కతా, అక్టోబర్ 2: భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ఎడమ బొటన వేలికి గాయమైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్, మూడో రోజు ఆటలో అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతి చేతికి బలంగా తగలడంతో గాయపడ్డాడు. వేలికి బ్యాండేజీ వేసుకొని బ్యాటింగ్‌ను కొనసాగించిన అతను పరుగుల ఖాతాను తెరవడానికి 14 బంతులు తీసుకున్నాడు. కాగా, ఆదివారం సాయంత్రం అతనిని ఎక్స్‌రే నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. నివేదిక వచ్చిన తర్వాత చికిత్సపై వైద్యులు ప్రకటన చేస్తారని జట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది. ఇప్పటికే ధావన్ ఇన్నింగ్స్ ముగియడంతో, అతని గాయం వల్ల ప్రస్తుతానికి భారత్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. టీమిండియా రెండో ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత అతను ఫీల్డింగ్‌కు దిగుతాడో లేదో చూడాలి. ధావన్ రెగ్యులర్ బౌలర్ కాదుకాబట్టి, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అతనికి విశ్రాంతినిచ్చినా ఆశ్చర్యం లెదు. ఇలావుంటే, ఒకవేళ ధావన్ గాయం తీవ్రమైనదైతే, చివరి టెస్టులో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్ట డానికి చటేశ్వర్ పుజారా అందుబాటులో ఉంటాడు. అంతేగాక, మ రో ఓపెనర్ గౌతం గంభీర్ రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. అతను కూడా ఇన్నింగ్స్‌ను ప్రారంభించే సత్తా ఉన్న వాడే కావడం కోహ్లీకి కలిసొచ్చే అంశం.