క్రీడాభూమి

ఏదో ఒకటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, అక్టోబర్ 3: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లేదా చాంపియన్స్ ట్రోఫీల్లో ఏదో ఒక టోర్నమెంట్‌లోనే టీమిండియా పాల్గొంటుందని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అన్నాడు. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పడానికి ఈ వివాదాన్ని బిసిసిఐ లేవనెత్తుతున్నది. ఒక టోర్నీకి, మరో టోర్నీకి మధ్య కనీసం 15 రోజుల వ్యవధి ఉండాలని, అందుకు తగినట్టు షెడ్యూల్‌ను నిర్ధారించుకోవాలని లోధా కమిటీ చేసిన సిఫార్సుల్లో ఒకటి. అయితే, వచ్చే ఏడాది చివరి వారంలో ఐపిఎల్ పూర్తవుతుందని, జూన్ ఒకటి నుంచి ఇంగ్లాండ్‌లో చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ఉంటుందని భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సోమవారం నాటి ఆటను గంట కొట్టి ప్రారంభించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఠాకూర్ చెప్పాడు. లోధా సిఫార్సులను బట్టి చూస్తే, ఐపిఎల్ పూర్తయిన సుమారు వారం రోజుల్లో మొదలయ్యే చాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం టీమిండియాకు ఉండదని స్పష్టం చేశాడు. ఒకవేళ ఆ టోర్నీలో ఆడాలంటే, ఐపిఎల్‌ను రద్దు చేయాల్సి ఉంటుందన్నాడు.
‘షెడ్యూల్‌ను మీరే నిర్ణయించండి’
చాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకొని, అంకంటే ముందు కనీసం 15 రోజుల ముందుగానే ఐపిఎల్ పూర్తయ్యే విధంగా షెడ్యూల్‌ను తయారు చేసుకోవచ్చుకదా అని ఓ విలేఖరి ప్రశ్నించడంతో ఠాకూర్ అసహనానికి గురయ్యాడు. ‘షెడ్యూల్‌ను మీరే నిర్ణయించండి’ అన్నాడు. ప్రపంచ క్రికెట్ చరిత్ర దిశను మార్చిన ఐపిఎల్‌ను నిర్వహించడానికి భారత్‌లో ఒకటిరెండు మాసాలే సరైనవని అన్నాడు. దాని ప్రకారమే షెడ్యూల్ ఉంటుందని వివరించాడు. బాడ్మింటన్, కబడ్డీ, ఫుట్‌బాల్, హాకీ తదితర క్రీడల్లో లీగ్ టోర్నీలు ఆవిర్భవించడానికి కారణమైన ఐపిఎల్‌కు ఎంతో ప్రాధాన్యం ఉందని చెప్పాడు. లోధా సిఫార్సులను తు.చ తప్పకుండా అమలు చేస్తే, ఇలాంటి గొప్ప టోర్నీని కోల్పోవాల్సి ఉంటుందని అన్నాడు. ఒకవేళ ఈ టోర్నీని కొనసాగిస్తే, చాంపియన్స్ ట్రోఫీకి దూరం కావాల్సి ఉంటుందని చెప్పాడు.
‘ఎన్నో చేశాం’
గత ఏడాదిన్నర కాలంలో ఎన్నో చేశామని, లోధా కమిటీ చేసిన చాలా సూచనలను అమలు చేస్తున్నామని ఠాకూర్ అన్నాడు. అయితే వాటిలో కొన్నింటిని అమలు చేయడం కష్టసాధ్యమవుతున్నదని చెప్పాడు. సచిన్ తెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ వంటి మేటి ఆటగాళ్లతో క్రికెట్ సలహా మండలిని ఏర్పాటు చేశామని, అదే విధంగా సీనియర్ జట్టుకు అనిల్ కుంబ్లేను, జూనియర్స్ జట్టుకు రాహుల్ ద్రవిడ్‌ను కోచ్‌లుగా నియమించామని తెలిపాడు. సిఇవో, సిఎఫ్‌వోల నియామక ప్రక్రియను పూర్తి చేశామన్నాడు. ఇలా చెప్తూపోతే బిసిసిఐ చేసిన పనులు చాలానే ఉన్నాయని చెప్పాడు.
‘నివేదికలో ఆ వాక్యం లేదు’
దారిలోకి రావాలని, లేకపోతే దారిలోకి తెచ్చుకోవాల్సి ఉంటుందని బిసిసిఐని సుప్రీంకోర్టు హెచ్చరించిన విషయాన్ని ప్రస్తావించగా, అలాంటిదేమీ లేదని ఠాకూర్ స్పష్టం చేశాడు. కోర్టు నివేదికలో ఎక్కడా ఆ వాక్యం లేదన్నాడు. అదంతా మీడియా సృష్టేనని ఆరోపించాడు. కోర్టు అంటే బిసిసిఐకి ఎంతో గౌరవం ఉందని, అదే సమయంలో తమిళనాడు సొసైటీల చట్టాన్ని కూడా అనుసరించాల్సి ఉంటుందని అన్నాడు.
ఒక రాష్ట్రానికి ఒకే ఓటు ఉండాలని లోధా కమిటీ చేసిన సూచన కూడా ఆచరణ సాధ్యం కాదని ఠాకూర్ చెప్పాడు. ముంబయి జట్టు రంజీ ట్రోఫీని ఎక్కువ పర్యాయాలు గెల్చుకుందని, అదే విధంగా బరోడా కూడా దేశవాళీ పోటీల్లో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిందని అన్నాడు. ఒక రాష్ట్రానికి ఒకే ఓటు సూత్రాన్ని అమలు చేస్తే, కొన్ని బలమైన సంఘాలకు నష్టం వాటిల్లుతుందని వ్యాఖ్యానించాడు. బోర్డు కార్యవర్య సభ్యులు మూడేళ్లు పదవిలో కొనసాగిన తర్వాత ఒక ఏడాది విశ్రాంతి తీసుకోవాలన్న సిఫార్సును సైతం ఠాకూర్ తప్పుపట్టాడు. ‘ఇలాంటి నిబంధనలను పాటిస్తే జగ్మోహన్ దాల్మియా వంటి పాలనాధ్యక్షులు ఎక్కడి నుంచి వస్తారు’ అని ప్రశ్నించాడు. కూల్ ఆఫ్ ప్రతిపాదన కు అర్థం లేదని విమర్శించాడు.

చిత్రం.. భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు నాలుగో రోజు ఆటను
గంటకొట్టి ప్రారంభిస్తున్న బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్