క్రీడాభూమి

పుణెపై ముంబయ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, అక్టోబర్ 3: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో పుణె సిటీపై ముంబయ సిటీ జట్టు 1-0 ఆధిక్యంతో గెలిచింది. మథియాస్ డిఫడిరికో కీలక గోల్ చేసి ముంబయని గెలిపించాడు. సొంతగడ్డపై మ్యాచ్ ఆడుతున్నందున, ఓటమిపాలు కాకూడదన్న ఉద్దేశంతో పుణె ఆది నుంచి రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది. ఆ వ్యూహమే జట్టు పరాజయానికి కారణమైంది. మ్యాచ్ ప్రథమార్ధంలో ఇరు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయ. ద్వితీయార్ధంలోనూ దాడులకు దిగకుండా డ్రిబ్లింగ్ చేస్తూ ఇరు జట్ల ఆటగాళ్లు సమయాన్ని మింగేసే ప్రయత్నం చేశాడు. అయతే, మ్యాచ్ 69వ నిమిషంలో ముంబయకి డిఫడిరికో ఒక గోల్‌ను సంపాదించి పెట్టాడు. ఆతర్వాత పుణెకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ముంబయ ఆటను ముగించింది. కాగా సొంత గడ్డపై పుణె ఓటమి అభిమానులను నిరాశపరచింది.