క్రీడాభూమి

చెల్లింపులు ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) మొండి వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న లోధా కమిటీ కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నది. బిసిసిఐ తరఫున ఎలాంటి చెల్లింపులు జరపరాదని ఆ సంస్థకు ఖాతాలున్న బ్యాంకులకు లేఖ రాసింది. దాని నకలును బిసిసిఐ కార్యదర్శి అజయ్ షిర్కే, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి రాహుల్ జోహ్రి, కోశాధికారి అనిరుద్ధ్ చౌదరీలకు కూడా పంపింది. సెప్టెంబర్ 30న హడావుడిగా పాలక మండలి సమావేశాన్ని నిర్వహించి, కొన్ని సభ్య సంఘాలకు భారీ మొత్తాలను చెల్లించేందుకు బిసిసిఐ తీర్మానాన్ని ఆమోదించినట్టు తమ దృష్టికి వచ్చిందని బ్యాంకులకు చైర్మర్ ఆర్‌ఎం లోధా పేరుతో రాసిన లేఖలో కమిటీ పేర్కొంది. సుప్రీం కోర్టు ఆదేశాలకు ఈ తీర్మానం పూర్తిగా విరుద్ధమని తెలిపింది. సుప్రీం కోర్టు తుది తీర్పును వెల్లడించేలోగా, సాధారణ పాలన తప్ప ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని బిసిసిఐకి ఈ ఏడాది ఆగస్టు 31న సూచించిన విషయాన్ని ఆ లేఖలో ప్రస్తావించింది. కొన్ని సభ్య సంఘాలకు భారీ మొత్తాలను చెల్లించడం అనేది సాధారణ పాలనా వ్యవహారాల్లో భాగం కాదని వ్యాఖ్యానించింది. అది అత్యవసరం కూడా కాదని తెలిపింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా కమిటీ సిఫార్సుల అమలుపై మొదటి దశ తీర్మానాలను తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఆ విషయాన్ని పక్కకుపెట్టడం ద్వారా బిసిసిఐ ఇప్పటికే బోర్డు ధిక్కారానికి పాల్పడిందని అన్నది. ఇటీవల కోర్టుకు స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించామని, ఆ నేపథ్యంలో బోర్డుకు ప్రధాన నిర్ణయాలు తీసుకునే హక్కు లేదని లోధా కమిటీ స్పష్టం చేసింది. కానీ, బోర్డు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదని, అందుకే, ఆ నిర్ణయాల అమలుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపింది. ఒకవేళ తమ
లేఖలోని అంశాలను పరిగణలోకి తీసుకోకుండా బిసిసిఐ తరఫున చెల్లింపులు జరిపితే, ఆ విషయాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళతామని హెచ్చరించింది. దేశ క్రికెట్ రంగాన్ని ప్రక్షాళన చేయడానికి సహకరించాలని సుప్రీం కోర్టు చేసిన సూచనలను బోర్డు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

చిత్రం.. ఆర్‌ఎం లోధా