క్రీడాభూమి

ఒక విజయం.. రెండు లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, అక్టోబర్ 3: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌ని 178 పరుగుల తేడాతో గెల్చుకున్న భారత క్రికెట్ జట్టు ఒకే విజయంతో రెండు లాభాలను సొంతం చేసుకుంది. కివీస్‌పై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. అంతేగాక, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను రెండో స్థానానికి నెట్టేసి, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సమయంలో పాక్‌ను టీమిండియా దెబ్బతీయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లకు 227 పరుగులు చేసి, పటిష్టమైన స్థితిలో ఉన్న భారత్ ఈ ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం ఉదయం ఆటను కొనసాగించి 263 పరుగులకు ఆలౌటైంది. అనంతరం న్యూజిలాండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే ఆలౌట్ చేసి, తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 316 పరుగులు సాధించగా, అందుకు సమాధానంగా న్యూజిలాండ్ 204 పరుగులకే ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 112 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన టీమిండియా నాలుగో రోజు ఆటను కొనసాగించింది. మరో 36 పరుగులు జోడించి, చివరి రెండు వికెట్లు కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ 23 పరుగులు చేసి నీల్ వాగ్నర్ బౌలింగ్‌లో హెన్రీ నికోల్స్ బౌలింగ్‌లో అవుట్‌కాగా, మహమ్మద్ షమీ (1)ని ట్రెంట్ బౌల్ట్ క్యాచ్ పట్టగా టామ్ లాథమ్ పెవిలియన్‌కు పంపాడు. భారత్ ఇన్నింగ్స్‌కు తెరపడే సమయానికి వృద్ధిమాన్ సాహా నాటౌట్‌గా ఉన్నాడు. అతను 120 బంతులు ఎదుర్కొని 58 పరుగులు చేశాడు.
భారీ లక్ష్యం
భారత్ నిర్దేశించిన 376 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఛేదించడం న్యూజిలాండ్‌కు అసాధ్యంగా మారింది. మ్యాచ్‌ని డ్రా చేసుకోవడానికి ఆ జట్టు ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ విజృంభణకు బెంబేలెత్తిన కివీస్ 81.1 ఓవర్లలో 197 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు టామ్ లాథమ్, మార్టిన్ గుప్టిల్ రెండో ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేయడానికి ప్రయత్నించారు. అయితే, తొలి వికెట్‌కు 55 పరుగులు జత చేసిన తర్వాత అశ్విన్ బౌలింగ్‌లో గుప్టిల్ (24) ఎల్‌బిగా వెనుదిరగడంతో న్యూజిలాండ్ మొదటి వికెట్ కోల్పోయింది. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన హెన్రీ నికోల్స్ 66 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్ల సాయంతో 24 పరుగులు చేసి, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఆజింక్య రహానేకు చిక్కాడు. అనుభవజ్ఞుడైన రాస్ టేలర్ మరోసారి విఫలమై, 28 బంతుల్లో కేవలం నాలుగు పరుగులు చేసి, అశ్విన్ బౌలింగ్‌లో ఎల్‌బి అయ్యాడు. అప్పటి వరకూ క్రీజ్‌లో నిలదొక్కుకొని, న్యూజిలాండ్‌ను ఓటమి నుంచి కాపాడే బాధ్యతను తన భుజాలపై వేసుకున్న లాథమ్ 74 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అశ్విన్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. అతను పెవిలియన్‌కు చేరడంతో మ్యాచ్‌ని డ్రా చేసుకునే అవకాశాలను కివీస్ చేజార్చుకుంది. ల్యూక్ రోన్చీ (60 బంతుల్లో 32), మాట్ హెన్రీ (44 బంతుల్లో 18 పరుగులు) మినహాయిస్తే మిగతా వారు సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారు. ఫలితంగా కివీస్ ఇన్నింగ్స్‌కు 197 పరుగుల వద్ద తెరపడింది. అశ్విన్, జడేజా, షమీ తలా మూడు వికెట్లు పడగొట్టారు.
ఎల్‌బిల రికార్డు
ఈ టెస్టులో మొత్తం 14 ఎల్‌బిలు నమోదయ్యాయి. భారత్‌లో జరిగిన టెస్టుల్లో అత్యధిక ఎల్‌బిలు ఇవే. 1996లో దక్షిణాఫ్రికాతో అహ్మదాబాద్‌లో జరిగిన టెస్టులో 13 ఎల్‌బిల రికార్డు బద్దలైంది.
ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఒక విదేశీ ఆటగాడు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకాన్ని నమోదు చేయడం ఇది నాలుగోసారి. టామ్ లాథమ్ 74 పరుగులు చేసి రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. ఇంతకు ముందు, 2005లో పాకిస్తాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకాన్ని సాధించాడు. కోల్‌కతాలో గత ఐదు టెస్టుల్లో ఏడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదు కావడం ఇది నాలుగోసారి. దక్షిణాఫ్రికాపై ధోనీ, వివిఎస్ లక్ష్మణ్ అజేయంగా 259, వెస్టిండీస్‌పై వీరే 224, అదే జట్టుపై రోహిత్ శర్మ, అశ్విన్ 280 పరుగులు చొప్పున ఏడో వికెట్‌కు భాగస్వామ్యాలను అందించారు. ఈ టెస్టులో రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా ఏడో వికెట్‌కు 103 పరుగులు జోడించారు.

స్కోరుబోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్: 104.5 ఓవర్లలో 316 ఆలౌట్ (చటేశ్వర్ పుజారా 87, ఆజింక్య రహానే 77, వృద్ధిమాన్ సాహా 54 నాటౌట్, మాట్ హెన్రీ 3/46, ట్రెంట్ బౌల్ట్ 2/46, వాగ్నర్ 2/57, జీతన్ పటేల్ 2/66).
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్: 53 ఓవర్లలో ఆలౌట్ 204 (రాస్ టేలర్ 36, ల్యూక్ రోన్చీ 35, బ్రాడ్లే వాల్టింగ్ 25, జీతన్ పటేల్ 47, భువనేశ్వర్ కుమార్ 2/48, మహమ్మద్ షమీ 3/-70).
భారత్ రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 8 వికెట్లకు 227): శిఖర్ ధావన్ ఎల్‌బి ట్రెంట్ బౌల్ట్ 17, మురళీ విజయ్ సి మర్టిన్ గుప్టిల్ బి మాట్ హెన్రీ 7, చటేశ్వర్ పుజారా ఎల్‌బి మాట్ హెన్రీ 4, విరాట్ కోహ్లీ ఎల్‌బి ట్రెంట్ బౌల్ట్ 45, ఆజింక్య రహానే సి ట్రెంట్ బౌల్ట్ బి మాట్ హెన్రీ 1, రోహిత్ శర్మ సి ల్యూక్ రోన్చీ బి మిచెల్ సాంట్నర్ 82, రవిచంద్రన్ అశ్విన్ ఎల్‌బి మిచెల్ సాంట్నర్ 5, వృద్ధిమాన్ సాహా 58 నాటౌట్, రవీంద్ర జడేజా సి సబ్‌స్టిట్యూట్ (నీషమ్) బి మిచెల్ సాంట్నర్ 6, భువనేశ్వర్ కుమార్ సి హెన్రీ నికోల్స్ బి నీల్ వాగ్నర్ 23, మహమ్మద్ షమీ సి టామ్ లాథమ్ బి ట్రెంట్ బౌల్ట్ 1, ఎక్‌స్ట్రిలు 14, మొత్తం 76.5 ఓవర్లలో 263 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-12, 2-24, 3-34, 4-43, 5-19, 6-106, 7-209, 8-215, 9-251, 10-263.
బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 17.5-6-38-3, మాట్ హెన్రీ 20-2-59-3, నీల్ వాగ్నర్ 15-3-45-1, జీతన్ పటేల్ 8-0-50-0, మిచెల్ సాంట్నర్ 16-2-60-3.
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: టామ్ లాథమ్ సి వృద్ధిమాన్ సాహా బి అశ్విన్ 74, మార్టిన్ గు ప్టిల్ ఎల్‌బి అశ్విన్ 24, హెన్రీ నికోల్స్ సి ఆజింక్య రహానే బి రవీంద్ర జడేజా 24, రాస్ టేలర్ ఎల్‌బి అశ్విన్ 4, ల్యూక్ రోన్చీ బి రవీంద్ర జడేజా 32, మిచెల్ సాంట్నర్ ఎల్‌బి మహమ్మద్ షమీ 9, బ్రాడ్లే వాల్టింగ్ 1, మాట్ హెన్రీ సి విరాట్ కోహ్లీ బి రవీంద్ర జడేజా 18, జీతన్ పటేల్ బి భువనేశ్వర్ కుమార్ 2, నీల్ వాగ్నర్ నాటౌట్ 5, ట్రెంట్ బౌల్ట్ సి మురళీ విజయ్ బి మహమ్మద్ షమీ 4, ఎక్‌స్ట్రాలు 0, మొత్తం (81.1 ఓవర్లలో ఆలౌట్) 197.
వికెట్ల పతనం: 1-55, 2-104, 3-115, 4-141, 5-154, 6-156, 7-175, 8-178, 9-190, 10-197.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 12-4-28-1, మహమ్మద్ షమీ 18.1-5-46-3, రవిచంద్రన్ అశ్విన్ 31-6-82-3, రవీంద్ర జడేజా 20-3-41-3.

చిత్రం.. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ను విజయపథంలో నడిపిన కెప్టెన్ విరాట్ కోహ్లీ. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా టెస్టు సిరీస్‌ను సాధించింది.