క్రీడాభూమి

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో.. రోహిత్, సాహా స్థానాలు మెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, అక్టోబర్ 4: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) విడుదల చేసిన టాప్-10 ఉత్తమ టెస్టు బ్యాట్స్‌మన్ల జాబితాలో టీమిండియా నుంచి ఎవరికీ స్థానం లభించలేదు. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఐసిసి విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత వికెట్ కీపర్/బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా, మరో బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ తమ స్థానాలను ర్యాంకులను గణనీయంగా మెరుగుపర్చుకున్నారు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో కొనసాగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా సోమవారం కోల్‌కతాలో ముగిసిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 54 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 58 పరుగులు సాధించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కైవసం చేసుకున్న వృద్ధిమాన్ సాహా ఐసిసి తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 56వ ర్యాంకుకు చేరుకోగా, కోల్‌కతా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులతో రాణించిన రోహిత్ శర్మ 14 స్థానాలు ఎగబాకి 38వ ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా, ఈ టెస్టులో మొత్తం 91 పరుగులు సాధించిన మరో భారత బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా కూడా ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని 15వ ర్యాంకుకు చేరుకున్నాడు.
బౌలర్ల జాబితాలో
మూడో స్థానానికి అశ్విన్
టాప్-10 టెస్టు బౌలర్ల జాబితాలో మాత్రం టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు రవీంద్ర జడేజాకి చోటు లభించింది. అయితే ఈ జాబితాలో అశ్విన్ ఒక స్థానం కిందికి దిగజారి 3వ ర్యాంకులో నిలువగా, కోల్‌కతా టెస్టులో నాలుగు వికెట్లు కైవసం చేసుకున్న రవీంద్ర జడేజా ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని 6వ ర్యాంకుకు ఎగబాకాడు. అలాగే ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 48 పరుగులకు 5 వికెట్లు కూల్చడంతో పాటు మొత్తం 6 వికెట్లు కైవసం చేసుకున్న ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తాజా ర్యాంకింగ్స్‌లో 9 స్థానాలు మెరుగుపర్చుకుని 26వ ర్యాంకుకు చేరుకోగా, దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ ఈ జాబితాలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే ఉత్తమ టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్ అగ్రస్థానం పదిలంగానే ఉంది.