క్రీడాభూమి

భారత్-కివీస్ మూడో టెస్టుకు ఎంపిసిఎ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 4: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు క్రికెట్ సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు చివరి టెస్టును నిర్వహించేందుకు మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపిసిఎ) ఏర్పాట్లు చేస్తోంది. ఎంపిసిఎకి చెందిన సీనియర్ అధికారి ఒకరు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) నుంచి ఇప్పటివరకూ తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని, కనుక భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య హోల్కర్ స్టేడియంలో మూడవ టెస్టు క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇండోర్ నుంచి ఎంపిసిఎ గౌరవ కార్యదర్శి మిలింద్ కన్మాదికార్ పిటిఐ వార్తా సంస్థకు స్పష్టం చేశాడు. బిసిసిఐకి చెందిన ఖాతాల నుంచి వివిధ రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు అధిక మొత్తాల్లో నిధులు విడుదల చేయకుడా ఆపేయాలని సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ లోధా కమిటీ బ్యాంకులను ఆదేశించడంతో భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ నిర్వహణపై సందేహాలు అనుమానాలు తలెత్తాయి. అయితే ఈ మ్యాచ్ నిర్వహణ కోసం ఇప్పటికే కొంత డబ్బును ఖర్చు చేశామని, ఈ మొత్తాన్ని తమకు వాపసు ఇవ్వాల్సిందిగా ఇప్పటివరకూ బిసిసిఐని కోరలేదని కన్మాదికార్ తెలిపాడు. ఇదిలావుంటే, భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య చివరి టెస్టును నిలిపివేయాల్సిందిగా ఇప్పటివరకూ బిసిసిఐ నుంచి తమకు అధికారికంగా ఎటువంటి ఆదేశాలు రాలేదని ఎంపిసిఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఓ) రోహిత్ పండిట్ ఇండోర్‌లో విలేఖర్లకు తెలిపాడు.

ఎంపిసిఎ గౌరవ కార్యదర్శి మిలింద్ కన్మాదికార్