క్రీడాభూమి

ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో.. భారత్ కెప్టెన్‌గా వందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: సింగపూర్‌లో ఈ నెల 29వ తేదీ నుంచి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో తలపడే భారత మహిళా హాకీ జట్టుకు ఫార్వర్డ్ క్రీడాకారిణి వందనా కటారియా సారథ్యం వహించనుంది. అయితే ఇటీవల రియో ఒలింపిక్స్‌లో భారత జట్టుకు సారథ్యం వహించిన సుశీలా చానూకు ఈ జట్టులో చోటు కల్పించకుండా డిఫెండర్ సునీతా లక్రాను వైస్-కెప్టెన్‌గా నియమించారు. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి మొత్తం 18 మంది సభ్యులతో ఎంపిక చేసిన భారత జట్టులో ఇద్దరు గోల్‌కీపర్లు, ఐదుగురు ఫార్వర్డ్ క్రీడాకారిణులు, ఆరుగురు మిడ్-్ఫల్డర్లు, ఐదుగురు డిఫెండర్లకు చోటు కల్పించారు. ఈ టోర్నీలో భారత్‌తో పాటు డిఫెండింగ్ చాంపియన్ జపాన్, చైనా, కొరియా, మలేసియా జట్లు తలపడనున్నాయి. పతకాన్ని సాధించలేకపోయినప్పటికీ ఉత్తమ రీతిలో ఒలింపిక్ క్రీడలను ముగించుకుని పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న తాము ఆసియా చాంపియన్స్ టోఫీ టోర్నీలో మరింత మెరుగ్గా రాణించేందుకు ఎదురు చూస్తున్నామని మహిళల హాకీ జట్టు కోచ్ నీల్ హాగుడ్ తెలిపాడు. కాగా, తమ శక్తి సామర్ధ్యాలను బేరీజు వేసుకునేందుకు ఈ టోర్నమెంట్ చక్కగా ఉపయోగపడుతుందని వందనా కటారియా అభిప్రాపడింది.
ఇదీ భారత జట్టు
గోల్‌కీపర్లు: సవితా, రజనీ ఎతిమరుపు, డిఫెండర్లు: దీప్ గ్రేస్ ఎక్కా, రేణుకా యాదవ్, సునీతా లక్రా, హనియలమ్ లాల్ రూత్ ఫెలీ, నమితా తొప్పో, మిడ్-్ఫల్డర్లు: నిక్కీ ప్రధాన్, నవ్‌జ్యోత్ కౌర్, మోనికా రాణి, దీపిక, నవ్‌దీప్ కౌర్, ఫార్వర్డ్స్: పూనమ్ రాణి, అనురాధా దేవి తొక్చోమ్, వందనా కటారియా, ప్రీతీ దూబే, పూనమ్ బర్లా.

వందనా కటారియా