క్రీడాభూమి

షరపోవాకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాసానే్న, అక్టోబర్ 4: నిషేధిత ఉత్ప్రేరకాలను వాడిందన్న ఆరోపణలపై రెండేళ్ల నిషేధం ఎదుర్కొంటున్న రష్యా టెన్నిస్ తార మరియా షరపోవాకు ఆర్బిట్రేషన్ కోర్టులో ఊరట లభించింది. ఈ నిషేధాన్ని లాసానే్నలోని క్రీడలకు సంబంధించిన మధ్యవర్తిత్వ న్యాయస్థానం 15 నెలలకు తగ్గించింది. దీంతో షరపోవా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్‌లో తిరిగి గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్‌లోకి రావడానికి వీలు కలుగుతుంది. గత ఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా షరపోవా నిషేధిత మెల్డోనియం వాడినందుకు ఆమెపై రెండేళ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే మెల్డోనియంను ‘వాడా’నిషేధించిన విషయం తనకు తెలియదని, మెల్బోర్న్‌లో జరిగిన ప్రతి మ్యాచ్‌కి ముందు తాను దాన్ని తీసున్నానంటూ అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ విధించిన నిషేధాన్ని షరపోవా సవాలు చేసింది. ఈ ఏడాది జనవరి 26నుంచి అమలులోకి వచ్చిన రెండేళ్ల నిషేధం మామూలుగా అయితే 2018 జనవరి 25 దాకా కొనసాగవలసి ఉంది. అయితే ఇప్పుడు దాదాపుఏడాది ముందే ఆమె మళ్లీ కోర్టులో అడుగుపెట్టనుంది. కాగా, టెన్నిస్ అంటే తనెంతో ఇష్టమని, తాను కోర్టులో ఎప్పుడు అడగుపెడతానా అని రోజులు లెక్కపెట్టుకొంటున్నానని నిషేధం తగ్గించడంపై స్పందిస్తూ షరపోవా వ్యాఖ్యానించింది.