క్రీడాభూమి

మ్యాచ్‌లకు ఆటంకాలు కలిగిస్తే ఊరుకునేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: దేశవాళీ లేదా అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆటంకాలు కలిగిస్తే ఊరుకునేది లేదని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డిడిసిఎ) అధికారులకు ముకుల్ ముద్గల్ స్పష్టం చేశాడు. అవినీతి, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిడిసిఎ పాలనా వ్యవహారాలు సక్రమంగా సాగేలా చూడడానికి పరిశీలకుడిగా ముద్గల్‌ను ఢిల్లీ హైకోర్టు నియమించింది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో డిడిసిఎ అధికారులకు ముద్గల్ హెచ్చరికలు జారీ చేశాడు. లోధా కమిటీ చేసిన సిఫార్సులను ఆసాంతంగా అమలు చేయాలని డిమాండ్ చేసిన ఏడుగురు డైరెక్టర్లను పదవుల నుంచి తప్పించాల్సిందిగా ఇద్దరు డిడిసిఎ సంయుక్త కార్యదర్శులు దినేష్ శర్మ, సుభాష్ శర్మ చేసిన డిమాండ్‌పై ముద్గల్ స్పందించాడు. ఇలాంటి అంతర్గత విభేదాలతో ఢిల్లీలో జరగాల్సిన వివిధ స్థాయి మ్యాచ్‌లకు ఇబ్బంది కలగవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లకు ఆటంకం కలిగితే ఉపేక్షించబోమని తేల్చిచెప్పాడు.