క్రీడాభూమి

ఏపిలో 2018 జాతీయ క్రీడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లజర్ల, జనవరి 8: జాతీయస్థాయి క్రీడలను 2018లో ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జిల్లా పరిషత్ ఛైర్మన్ కప్ క్రీడాపోటీలను శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ప్రపంచస్థాయి క్రీడాపోటీలు నిర్వహించుకునే విధంగా స్టేడియం నిర్మించామన్నారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉండగానే ఆఫ్రో-ఆసియన్ క్రీడలను నిర్వహించామని గుర్తుచేశారు. రాష్ట్రంలో అమరావతి, విశాఖపట్నం, తిరుపతిలలో మెగా స్పోర్ట్స్ స్టేడియంలు నిర్మిస్తామన్నారు. జాతీయస్థాయి క్రీడల్లో నైపుణ్యం చాటగల సత్తా మన యువతలో ఉందన్నారు. జాతీయస్థాయిలో మన రాష్ట్రానికి బంగారు పతకాలు లేవని, ఈసారి వాటిని సాధించే క్రీడాకారులను తయారుచేయడానికి రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. దీనిలో భాగంగా యువతలో క్రీడానైపుణ్యాన్ని వెలికితీయడానికి ప్రతి జిల్లాలో అత్యంత ఆధునిక వసతులతో కూడిన క్రీడాప్రాంగణాలు ఏర్పాటుచేస్తామన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ అలవడుతుందని, క్రమశిక్షణతో దేశభవిష్యత్‌ను మన యువత ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచస్థాయి కార్పొరేట్ సంస్థల్లో మన తెలుగువారు సిఇఓలుగా పనిచేస్తూ తెలుగుతేజాన్ని ప్రపంచానికి చాటిచెపుతున్నారని, కానీ క్రీడల్లో మాత్రం బంగారు పతకాలు సాధించటంలో వెనుకబడి ఉన్నారన్నారు. ప్రపంచాన్ని శాసించే శక్తి మన యువతలో ఉందని, ప్రతి విద్యార్థి విద్యతోపాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏ క్రీడలోనైనా ఓడిపోతే చింతించకుండా గెలవడానికి ప్రయత్నించే క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిల్లా మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, ఎంపిలు తోట సీతారామలక్ష్మి, మాగంటి మురళీమోహన్, మాగంటి బాబు, గోకరాజు గంగరాజు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, శాసనమండలి విప్ అంగర రామ్మోహనరావు, జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, వైస్‌ఛైర్మన్ సిహెచ్ వెంకటరమణ, రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ ఛైర్మన్ పిఆర్ మోహన్, జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.