క్రీడాభూమి

అర్జున్ ఖాతాలోకి మరో శిఖరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: భారత పర్వతారోహకుడు అర్జున్ వాజ్‌పాయ్ మరో అరుదైన ఫీట్ సాధించాడు. ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరాల్లో ఆరోదైన చో యూను అధిరోహించిన ఘనతను తన ఖాతాలో వేకున్నాడు. ప్రపంచంలో 8,000 మీటర్ల కంటే ఎత్తయిన 14 శిఖరాల్లో ఐదింటిని 23 ఏళ్ల అర్జున్ ఇప్పటి వరకూ అధిరోహించాడు. వౌంట్ లోట్సే, వౌంట్ మనాస్లూ, వౌంట్ మకాలూలను ఎక్కిన వారిలో అత్యంత పిన్న వయస్కుడిగా అతను ఇప్పటికే ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6.20 నిమిషాలకు షెర్పాలు పసాంగ్ నొబూ, లక్ఫాలతో కలిసి తాను చో యూ శిఖరాగ్రానికి చేరుకున్నట్టు పిటిఐతో మాట్లాడుతూ నోయిడాకు చెందిన అర్జున్ చెప్పాడు. సాధ్యమైనంత త్వరలో మిగతా ఎత్తయిన శిఖరాలను కూడా అధిరోహిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.