క్రీడాభూమి

కొకైన్ వాడాను.. తప్పేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, అక్టోబర్ 5: బ్రిటన్‌కు చెందిన బాక్సర్ టైసన్ ఫ్యూరీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో తెరపైకి వచ్చాడు. ఎప్పుడూ ఏదో ఒక రకమైన వివాదంలో చిక్కుకునే అతను ఈసారి మాదక ద్రవ్యాలను వాడినట్టు అంగీకరించడం విశేషం. తాను కొకైన్‌ను వాడానని స్పష్టం చేసిన అతను అందులో తప్పేమీ లేదని తనను తాను సమర్ధించుకున్నాడు. ‘చాలా పెద్ద మొత్తంలో కొకైన్‌ను వాడాను. ఇది నిజం. అయితే, అందులో తప్పేముంది? ఇది నా జీవితం.. నా ఇష్టం.. ఏమైనా చేస్తా.. ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు’ అని రోలింగ్ స్టోన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్యూరీ వ్యాఖ్యానించాడు. తనను చంపేయాలంటూ అరిచాడు. ‘నన్ను నేను చంపుకొనేలోపే నన్ను ఎవరైనా చంపాలి’ అని ఇటీవల అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ఫ్యూరీ అన్నాడు. ఇది తన సొంత నిర్ణయమేనని 28 ఏళ్ల ఫ్యూరీ అన్నాడు. వాస్తవానికి అతను తన డబ్ల్యుబిఎ, డబ్ల్యుబివో టైటిళ్లను నిలబెట్టుకోవడానికి వ్లాదిమిర్ క్లిచెకోతో తలపడాల్సి ఉంది. అయితే, ఆ బౌట్‌ను రద్దు చేసుకుంటున్నానని, వ్యక్తిగత కారణాల వల్ల రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నానని ఫ్యూరీ ఒక తెలిపాడు. క్లిచెకోతో రెండు పర్యాయాలు ఫైట్‌ను రద్దు చేసుకోవడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తాను చాలాకాలంగా జిమ్‌కు వెళ్లడం లేదని ఫ్యూరీ అన్నాడు. అన్ని విధాలా సిద్ధంగా ఉన్నప్పుడే ఫైట్ కోసం రింగ్‌లోకి దిగాలని చెప్పాడు. కెరీర్‌లో 25 ఫైట్స్‌లో బరిలోకి దిగిన అతను అన్నింటిలోనూ విజయాలు సాధించాడు. వీటిలో 18 నాకౌట్ ద్వారా లభించినవే కావడం విశేషం. ఆరు అడుగులా, తొమ్మిది అంగుళాల పొడవుతో ప్రత్యర్థులను గడగడలాడించే ఫ్యూరీ దాదాపు ప్రతి ఫైట్‌లోనూ ఏదో ఒక వివాదంలో చిక్కుకునే వాడు. ప్రతిభావంతుడిగా పేరు సంపాదించినప్పటికీ, నోటి దురుసు, దుందుడుకు స్వభావంతో చాలా మంది అభిమానులను దూరం చేసుకున్నాడు. అతని మానసిక పరిస్థితిపై అనుమానాలు కూడా ఉన్నాయి. తాజా వ్యాఖ్యలు ఈ అనుమానాలను పెంచుతున్నాయి.